ఇష్టం లేకుండానే ..మహా పాద యాత్ర కు బీజేపీ ?

ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం గురించి చెప్పుకుంటే అది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశంగానే జనాలు ,  రాజకీయ వర్గాలు చూసే పరిస్థితి.ఒక ప్రాంతంలో ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు అమరావతి వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తెరమీదకు తీసుకు వచ్చిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.

 Ap Bjp Leaders Participating In The Amravati Farmers Padayatra Against Their Wil-TeluguStop.com

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టింది.  మూడు రాజధానులు అంశం తెర మీదకు తీసుకు వచ్చింది.

ఇక బీజేపీ కూడా అమరావతి వ్యవహారం తమకు సంబంధం లేని అంశం గానే చూస్తూ వచ్చింది.అంతేకాదు ఈ వ్యవహారం పై టిడిపి పైన విమర్శలు ఏపీ బిజెపి నాయకులు చేసేవారు.

అయితే ఇప్పుడు అదే అమరావతి ఉద్యమంలో ఏపీ బీజేపీ నేతలు మద్దతిచ్చి చేయాల్సిన  పరిస్థితి ఏర్పడింది.

దీనికి కారణం ఇటీవల తిరుపతి వచ్చిన కేంద్ర హోం మంత్రి బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా ఈ విషయంలో పార్టీ నేతలకు గట్టిగా క్లాస్ పీకడమే కారణం.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 21వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలోని బిజెపి ప్రతినిధుల బృందం మహాపాదయాత్ర చేపడుతున్న అమరావతి రైతులను కలిసి వారికి సంఘీభావం తెలపడం తో పాటు,  కొంత దూరం పాదయాత్ర లో పాల్గొనబోతున్నారు.ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు అమరావతి రైతుల పాదయాత్ర చేరుకుంది.

బిజెపి కూడా ఇప్పుడు మద్దతు ఇవ్వడంతో మహా పాదయాత్ర లో ఉత్సాహం వచ్చే అవకాశం కనిపిస్తోంది .ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు ఈ ఉద్యమంపై బీజేపీ నేతలు కొందరు సెటైర్లు వేసే వారు.
   

Telugu Ap Bjp, Chandrababu, Jagan, Maha Padayathra, Somu Veerraju, Sujana Chowda

 అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ అనడంతో పాటు , పాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతుల డ్రెస్సింగ్ స్టైల్ పైన విమర్శలు చేసేవారు .కానీ అమిత్ షా గట్టిగానే ఈ విషయంలో క్లాస్ పీకడం తో ఇప్పుడు మద్దతు ఇవ్వడమే కాకుండా స్వయంగా పాదయాత్రలో ఏపీ బిజెపి నాయకులు పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఇప్పటికే కొంతమంది బిజెపి ఏపీ నేతలు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.మొదటినుంచి చూసుకుంటే బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి  .ఒక వర్గం లో ఉన్న సుజనా చౌదరి తదితరులు అమరావతికి మొదటి నుంచి మద్దతు పలుకుతూ ఉండే వారు .ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం అమరావతి  వ్యవహారంపై స్పందించేందుకు ఇష్టపడేది కాదు.కానీ ఇప్పుడు  మద్దతు పలకవల్సిన పరిస్థితి ఏర్పడింది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube