ఏపీలో ఈ బీజేపీ నేత‌ల నోటికి ప్లాస్ట‌ర్లు… ఆ సెంటిమెంట్ భ‌యమేనా…!  

these ap bjp leaders mouths are shutdown, Ap, BJP, MP Hari Babu, Ap Capital Amaravathi, Kanna Laxmi Narayana, Prakasam, Chitoore, Narendra Modi, YS Jagan - Telugu Ap, Ap Capital Amaravathi, Bjp, Chitoore, Kanna Laxmi Narayana, Mp Hari Babu, Narendra Modi, Prakasam, Ys Jagan

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో బీజేపీ బ‌ల‌ప‌డేనా? ఇక్క‌డి నేత‌లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే బీజేపీలో వినిపిస్తున్నాయి.చ‌ర్చ‌కు కూడా వ‌స్తున్నాయి.

TeluguStop.com - Ap Bjp Leaders Mouths Are Shutdown

దీనికి రీజ‌నేంటి? ఎందుకు హ‌ఠాత్తుగా ఉత్త‌రాంధ్ర విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది? అంటే.ఇక్క‌డ పార్టీని ముందుండి న‌డిపించిన కీల‌క నాయ‌కులు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.

విశాఖ మాజీ ఎంపీ హ‌రిబాబు.వంటి వారు కూడా ఎక్క‌డా మీడియా ముందుకు రావ‌డం లేదు.

TeluguStop.com - ఏపీలో ఈ బీజేపీ నేత‌ల నోటికి ప్లాస్ట‌ర్లు… ఆ సెంటిమెంట్ భ‌యమేనా…-General-Telugu-Telugu Tollywood Photo Image

కీల‌క‌మైన రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఏ ఒక్క‌రూ మాట్లాడడం లేదు.అంటే.

వీరికి అమ‌రావ‌తి కావాల‌నే ఉందా?  లేక జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు విశాఖ‌ను రాజ‌ధానిగా కోరుకుంటున్నారా?

నిజానికి ఈ విష‌యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా.కృష్ణా, గుంటూరు బీజేపీ నేత‌లు క్లారిటీగా ఉన్నారు.

గ‌తంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బ‌హిరంగంగానే అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ప‌లికారు.ఉద్య‌మాల్లోనూ పాల్గొన్నారు.

అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా పాద‌యాత్ర కూడా చేశారు.దీంతో ప్ర‌కాశం.

చిత్తూరు.నేత‌లు కూడా అమ‌రావ‌తి కావాల‌ని డిమాండ్ చేశారు.

కానీ, ఎటొచ్చీ.ఉత్తరాంధ్ర నేత‌లు మాత్రం మౌనంగా ఉన్నారు.

వీరికి ఏం కావాలో తేల్చుకోలేక పోతున్నారా? అంటే.అది కూడా కాదు.

వీరికి విశాఖ పాల‌నారాజ‌ధాని కావాల‌నే ఉంది.కానీ, ఎటొచ్చీ ఓ పెద్ద సెంటిమెంట్ వీరిని క‌ట్టి ప‌డేస్తోంది.

అదే.అమ‌రావ‌తికి.నేరుగా కేంద్రం నుంచి వ‌చ్చి శంకు స్థాప‌న చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కార్య‌క్ర‌మం.అదే సెంటిమెంటుగా మారింది.

తాము అమ‌రావ‌తిని వ‌ద్దని.విశాఖ‌నే కోరుకుంటే.

మోడీ చేసిన శంకు స్థాప‌న‌ను వ్య‌తిరేకించిన‌ట్టే అవుతుంది క‌దా.! అనేది వీరి సందేహం.

అంతే త‌ప్ప‌.రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌తో వీరికి సంబంధం లేన‌ట్టుగా నే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ విష‌యంలో ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర బీజేపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది.

ఎవ‌రూ దీనిపై మాట్లాడ‌లేదు.

ఎక్క‌డ అమ‌రావ‌తిని వ్య‌తిరేకించినా.మోడీకి వ్య‌తిరేకంగా తాము గ‌ళం విప్పామ‌నే సంకేతాలు వెళ్తాయోన‌నివారు భీతిల్లుతున్నారు.

అయితే.ఇలా ఎన్నాళ్లు?  ఎప్పుడో ఒక‌ప్పుడు .నోరు విప్పాల్సిందే క‌దా? అన్నా కూడా వీరు మాత్రం రాజ‌కీయంగా జ‌గ‌న్ ఏదో ఒక‌టి తేల్చుకుంటారు.అప్పుడు చూద్దాం!! అని స‌రిపెడుతున్నారు.

మ‌రి ఇది ఉత్త‌రాంధ్ర బీజేపీకి న్యాయం చేస్తుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

#ApCapital #YS Jagan #Narendra Modi #KannaLaxmi #Mp Hari Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Bjp Leaders Mouths Are Shutdown Related Telugu News,Photos/Pics,Images..