గవర్నర్ తో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతల బృందం..!!

ఇటీవల టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు సంఖ్య విషయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని బోర్డులో సభ్యులుగా తీసుకుంటూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.దాదాపు 25 మందిని ఎంచుకుని టీటీడీ బోర్డు నూతన పాలకమండలి జాబితా ఖరారు చేయడం జరిగింది.

 Ap Bjp Leaders Meet Governor Ap Bjp, Somu Veerraju, Ys Jagan, Ap Poltics , Ap Bj-TeluguStop.com

ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ బీజేపీ నేతల బృందం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీ కలిశారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ నూతన పాలకమండలి సభ్యులు విషయంలో ప్రభుత్వాని పిలిచి మాట్లాడాలని గవర్నర్ ని కోరారు.సీఎం జగన్ కి హిందూ ధార్మిక సంస్థలు పైభక్తి భావం లేదని.

హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రత్యేక ఆహ్వానితులు విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు.

అంత మంది సభ్యులు ఉంటే భక్తులకు అసౌకర్యం గా ఉంటుందని సోము వీర్రాజు తెలిపారు.ఈ విషయంలో గవర్నర్ ప్రభుత్వాన్ని పిలిపించి సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్చించాలని కోరినట్లు సోము వీర్రాజు.

  భేటీ అనంతరం మీడియాతో తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube