కోత‌లరాయుళ్ల‌ను త‌ల‌పిస్తున్న క‌మ‌లం నేత‌లు       2018-06-05   00:07:43  IST  Bhanu C

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేసిన బీజేపీ నేత‌లు టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్టేందుకు, రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏమాత్రం ఫ‌లించ‌డం లేదు. ఇక చేసేదేమీ లేక చేతిలో ప‌నిలేక కోత‌ల‌రాయుళ్ల‌ను త‌ల‌పించేలా మాట్లాడుతున్నారు. మే 15త‌ర్వాత ఏపీలో అనూహ్య ప‌రిణామాలు ఉంటాయ‌నీ, వాట‌న్నింటికీ సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఆ త‌ర్వాత తోక‌ముడిచారు. క‌ర్ణాట‌క‌లో అధికారం కోసం అడ్డ‌దారులు తొక్కి అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు చేతిలో అడ్డంగా బుక్క‌య్యారు.

జాతీయ స్థాయిలో ప‌రువుపోగొట్టుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌క‌మ‌లం నేత‌ల‌కు నిజానికి ఇప్పుడు చేతిలో కార్యాచ‌ర‌ణ లేకుండా పోయింది. తాజాగా… విజ‌య‌వాడలో జీవీఎస్ న‌ర‌సింహారావు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌ళ్లీ ఇలాంటి కోత‌లే కోశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తే 24 గంటల్లో అసలు విషయాలు బయటపెడతానని జీవీఎల్‌ అన్నారు. దీని ప‌ర్య‌వ‌సానాల‌కు ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. అయితే ఇటీవ‌ల‌ విజ‌య‌వాడ‌లో నిర్వహించిన టీడీపీ మ‌హానాడు వేదిక‌గా చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌ర‌ నిర్మాణం, నిధుల ఖ‌ర్చుల‌పై యూసీలు ప్ర‌ద‌ర్శించారు.

కేంద్రానికి, నీతి ఆయోగ్‌కు స‌మ‌ర్పించిన ఆధార స‌హిత యూసీల‌ను మ‌హానాడులో ప్ర‌ద‌ర్శించి, క‌మ‌లం నేత‌ల‌కు చంద్ర‌బాబు వాత‌లు పెట్టారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాకు దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. ఈ దీనిపై ఇప్ప‌టికీ స్పందించ‌ని బీజేపీ నేత‌లు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఏపీలో త‌మ‌కు మూడు నుంచి నాలుగు నెల‌ల స‌మ‌యం చాల‌నీ, చక్రం తిప్పేస్తామ‌ని బీరాలు ప‌లికిన బీజేపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టిన‌గ‌తే ప‌డుతుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మిస్తున్న చంద్ర‌బాబును త‌ట్టుకోలేక రాష్ట్ర బీజేపీ నేత‌లు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇన్ని నెల‌లుగా ప్ర‌త్యేక హోదా కోసం ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తి నుంచి సామాన్యుడి వ‌ర‌కూ ఉద్య‌మిస్తున్నా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోరు విప్ప‌క‌పోవ‌డంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి.

కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీకి, వైసీపీకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారనీ చంద్ర‌బాబు అతితెలివికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. కానీ, లోక్‌స‌భ‌లో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మోడీతో కాళ్ల బేరానికి దిగడం, ఏపీలో జ‌గ‌న్ బ‌ల‌మైన నాయ‌కుడంటూ విజ‌య‌వాడ‌లో కేంద్ర‌మంత్రి రాందాస్ అథవాలె పొగ‌డ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌లో క‌మ‌ల‌నాథులే చెప్పాల‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.