బిజెపి నాయకుల్లో ఈ భిన్నస్వరాలు ఏంటి ?  

Ap Bjp Leaders Different Voice Speech About Tdp And Chandrababu Naidu-ap Tdp Party,chandrababu Naidu,chandrababu Naidu Again Start Friendship With Bjp Party,kanna Laxminarayana Comments On Chandrababu Naidu

ఏపీలో బిజెపి పార్టీ ఇప్పుడిప్పుడే బలపడుతోంది.కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఇతర పార్టీల నుంచి నాయకులు ఒక్కొక్కరుగా బిజెపి లోకి క్యూ కడుతున్నారు.భారీగా వస్తున్న వలసలతో ఆ పార్టీ రోజు రోజుకి బలం పెంచుకుంటూనే ఉంది.

Ap Bjp Leaders Different Voice Speech About Tdp And Chandrababu Naidu-ap Tdp Party,chandrababu Naidu,chandrababu Naidu Again Start Friendship With Bjp Party,kanna Laxminarayana Comments On Chandrababu Naidu-AP BJP Leaders Different Voice Speech About TDP And Chandrababu Naidu-Ap Tdp Party Chandrababu Naidu Again Start Friendship With Bjp Kanna Laxminarayana Comments On

2014 ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీకి 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు ఇంకా ఎంపీ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి.ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది .మొన్నటి వరకు అధికారం చేపట్టిన టిడిపి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా రోజు రోజుకు బలహీనం అవుతున్న నేపద్యంలో ఆ పార్టీ మనుగడ మీద అందరికీ అనుమానాలు పెరిగిపోయాయి.

Ap Bjp Leaders Different Voice Speech About Tdp And Chandrababu Naidu-ap Tdp Party,chandrababu Naidu,chandrababu Naidu Again Start Friendship With Bjp Party,kanna Laxminarayana Comments On Chandrababu Naidu-AP BJP Leaders Different Voice Speech About TDP And Chandrababu Naidu-Ap Tdp Party Chandrababu Naidu Again Start Friendship With Bjp Kanna Laxminarayana Comments On

ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనను చంద్రబాబు నాయుడు పరోక్షంగా వ్యక్తం చేశారు.బీజేపీతో తెగదెంపులు చేసుకుని అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకున్నాను అనే సంకేతాలను బీజేపీ అధిష్టానానికి చంద్రబాబు తెలియజేశారు.

దీనిపై బిజెపి నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడితే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో బల పడవచ్చని బాబు భావించారు.అయితే దీనిపై ఏపీ బిజెపి నాయకులు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేశారు.

బిజెపితో కలిసేందుకు చంద్రబాబు ఆసక్తిగా ఉన్నా తాము మాత్రం డోర్లు మూసేశామని ఏపీ ఏపీ బిజెపి ఇన్ చార్జి సునీల్ దేవ్ ధర్, ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజు ప్రకటించారు.

ఇదే అంశంపై రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాత్రం టిడిపిని బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా చంద్రబాబు లేఖ ఇస్తే అమిత్ షా తో తాను మాట్లాడుతానని చెప్పారు.మరో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇలా బిజెపి నాయకులు అంతా తలో రకంగా మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు కేవలం ఈ ఒక్క విషయంలోనే కాకుండా రాజధాని అమరావతి ,పోలవరం ప్రాజెక్ట్ తదితర విషయాలలో కూడా ఇదే రకంగా భిన్న స్వరాలు వినిపిస్తూ అందరిని గందరగోళంలోకి పెడుతున్నారు.మొత్తంగా బిజెపి నాయకుల వ్యవహారం చూస్తుంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఏపీ విషయంలో వ్యవహరిస్తూ తమలో తమకు సమన్వయం లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు.