అమరావతి కే బీజేపీ ఫిక్స్ ? వారి మద్దతు కోసం ట్రిక్స్ ?

మొత్తానికి మొదట్లో అమరావతిని రాజధానిగా వ్యతిరేకించిన బిజెపి ఇప్పుడు అమరావతి రాజధాని అని పాదయాత్రకు దిగిపోయింది.అమరావతి సెంటిమెంట్ ఎక్కువగా ఉందనే విషయాన్ని బిజెపి కాస్త ఆలస్యంగా గుర్తించింది.

 Ap Bjp Leaders Demands Amaravathi As Ap State Capital Details, Amaravathi, Bjp,-TeluguStop.com

అందుకే మొదట్లో మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడిన బిజెపి నేతలు ఇప్పుడు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తోంది.అంతే కాదు మూడు రాజధానులను  వైసిపి నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెబుతూనే బిజెపి అమరావతి కోసం కట్టుబడి ఉందని,  అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

మనం మన అమరావతి పేరుతో పాదయాత్ర నిర్వహించిన బిజెపి.వారం రోజులపాటు అమరావతి పరిధిలోని గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు.
  పార్టీ కీలక నాయకులంతా ఈ యాత్రలో పాల్గొన్నారు.ముఖ్యంగా మొదటి నుంచి అమరావతికి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్న మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , సుజనా చౌదరి వంటి వారు అమరావతి పాదయాత్ర ముగింపు సభలో ఉత్సాహంగా కనిపించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగుతుందని అమరావతి పరిసర ప్రాంత రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు రాజధాని మార్చే అవకాశం లేదని చెప్పుకొచ్చారు.జగన్ చేసిన అతి పెద్ద తప్పు రాజధాని రైతులకు అన్యాయం చేయడమేనని బిజెపి రాజ్యసభ సభ్యుడు సృజన చౌదరి హామీ ఇచ్చారు.
 

Telugu Amaravathi, Ap Bjp, Bjp Padayathra, Congress, Manammana, Somu Veeraju, Ys

ఏపీకి సీఎం మారినప్పుడల్లా రాజధాని మారడం అభివృద్ధికి చేటు అంటూ సృజన అన్నారు.అసలు అభివృద్ధి చేయడం తెలియని ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.అమరావతి పాదయాత్ర విషయంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కు అనుకున్నంత స్థాయిలో అయితే క్రెడిట్ దక్కలేదని చెప్పాలి .కొద్ది నెలల క్రితం వరకు అమరావతికి వ్యతిరేకంగా వీర్రాజు ప్రకటనలు చేశారు.ఆ తర్వాత అమిత్ షా క్లాస్ పీకడంతో తను వైఖరిని మార్చుకున్నారు.ఇప్పుడు అమరావతికి జై కొడుతూ రాజధాని పరిసర ప్రాంత రైతుల , ప్రజల మద్దతు పొందెందుకు ప్రయత్నిస్తున్నారు.

కాకపోతే వీర్రాజు కు ఆశించిన స్థాయిలో అయితే మద్దతు కనిపించడం లేదు.కానీ అమరావతి సెంటిమెంటును ఉపయోగించుకుని రైతులు, అమరావతి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు మద్దతు పొందేందుకు మాత్రం బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే అర్థమవుతుంది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube