ఏపీ లో ఆ రెండు పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి అంటూ వ్యాఖ్యానించిన పురంధరేశ్వరి  

Ap Bjp Leader Purandeswari Sensational Comments On Ap Cm Jagan - Telugu , Ap Bjp Party, Ap Cm Jagan Mohan Reddy, Jagan In Delhi Tour, Jagan In Polavaram, Jagan In Polavaram Reverse Tenmdering, Purandeswari

ఇటీవల ఏపీ సీఎం వై ఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఢిల్లీ పర్యటన తరువాత ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్ తీరుపై ఏపీ బీజేపీ నేతలు తమ దైన శైలి లో స్పందిస్తున్నారు.

Ap Bjp Leader Purandeswari Sensational Comments On Cm Jagan - Telugu Ap Bjp Party Cm Mohan Reddy In Delhi Tour Polavaram Reverse Tenmdering

తాజాగా కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ మహిళా నేత పురంధరేశ్వరి ఏపీ లో జగన్ పని తీరు పై సంచలన ఆరోపణలు చేశారు.రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి అని,ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప రాష్ట్రం లో అభివృద్ధి శూన్యం అని ఆమె మండిపడ్డారు.

అంతేకాకండా వైసీపీ,టీడీపీ రెండు పార్టీ లు కూడా తమ చర్యలతో ప్రజల విశ్వాసం కోల్పోయారు అంటూ ఆమె విమర్శించారు.ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని,ఆర్ధిక లోటు లో పధకాలు ఎలా అమలు చేస్తారు అంటూ ఆమె ప్రశ్నించారు.

అలానే మూడు రాజధానుల అంశం తో పెట్టుబడులు మొత్తం వెనక్కి వెళుతున్నాయి అని, అసలు రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి అంటూ ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలానే శాసన మండలి రద్దు పై మాట్లాడిన ఆమె దానివల్ల ఉపయోగం లేదు అన్నప్పుడు కేబినెట్ తోలి భేటీ లోనే ఎందుకు రద్దు చేయాలని కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు.

తాజా వార్తలు