ఆ క్రెడిట్ కొట్టేసే ప‌నిలో ప‌డ్డ ఏపీ బీజేపీ..!

రాజ‌కీయాలు అన్న త‌ర్వాత చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రించాలి.ఒక‌ప్పుడు ప‌ని చేసి క్రెడిట్ తెచ్చుకునేవారు.

 Ap Bjp Is In The Process Of Giving That Credit ..!, Ap Bjp, Jagan, 26 Districts-TeluguStop.com

కానీ ఇప్పుడు ట్రెండ్ మారి పోయింది.చిన్న అవ‌కాశం దొర‌కినా స‌రే క్రెడిట్ కొట్టేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు.

ఈ విష‌యాలు అన్నీ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి.

నిన్న ఏపీలో కొత్త‌గా 13 కొత్త జిల్లాలతో మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.అయితే ఈ ప్రతిపాద‌న మీద ఇప్పుడు ఏపీ బీజేపీ త‌న దైన స్టైల్ లో స్పందించింది.

ఎక్క‌డా దీన్ని వ్య‌తిరేకించ‌కుండా.క్రెడిట్ కొట్టేసేందుకు రెడీ అయిపోయారు.

ఈ కొత్త జిల్లాలు చేయ‌డం అనేది ప్ర‌జ‌ల్లో పాజ‌టివ్ వేవ్‌ను తీసుకు వ‌చ్చే అంశ‌మే.ఎందుకంటే ప‌రిపాల‌న సౌల‌భ్యాలు పెరుగుతాయి.

కాగా ఈ క్రెడిట్ మొత్తం జ‌గ‌న్‌కు ఎక్క‌డ వెళ్లిపోతుందో అనే భ‌యంతో బీజేపీ రంగంలోకి దిగిపోయింది.కొత్త జిల్లాల ఏర్పాటును తాము ఎప్ప‌టి నుంచో ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని తాము స్వాగతిస్తున్నట్టు వెల్ల‌డించారు.ఏపీ బీజేపీ కీల‌క నేత కన్నా లక్ష్మీనారాయణ ఇదే విష‌యాన్ని మీడియాతో పంచుకున్నారు.

తాము పోయిన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశాల‌ను చేర్చిన‌ట్టు వివ‌రించారు.

తాము గత ఎన్నిక‌ల్లో గెలిస్తే పార్లమెంటు నియోజకవర్గాల‌ను మొత్తం జిల్లాలుగా మార్చేస్తామ‌ని ఎన్నడో చెప్పేశామ‌ని, లేటుగా అయినా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం బాగానే ఉంద‌ని చెప్పుకొచ్చారు.కాగా ఏపీ బీజేపీ చీఫ్ అయిన సోము వీర్రాజు మాత్రం ఈ విష‌యంపై ఎలాంటి స్పంద‌న చేయ‌లేదు.కాగా ఒక విష‌యం ఏంటంటే.

బీజేపీ మ‌దిలో ఈ విష‌యం ఉంటే.ఇన్ని రోజులు ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌నే అనుమానాలు కూడా తెర మీద‌కు వ‌స్తున్నాయి.

మ‌రి బీజేపీ నుంచి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే సోము ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube