బీజేపీ వైపు బాబు చూపులు ! రియాక్షన్ వేరేగా ఉందే ?  

Ap Bjp Incharge Sunil Deodhar Comments On Chandrababu - Telugu , Ap Chandrababu Comments On Bjp, Chandrababu And Modi Good Friendship, Janasena And Ycp, Sunil Deodhar, Tdp Leaders Join In Bjp

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కుంటోంది.పార్టీకి చెందిన కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా చేజారిపోతుండడం, అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ గా చేసుకోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న టీడీపీ నాయకులు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

Ap Bjp Incharge Sunil Deodhar Comments On Chandrababu

అదీ కాకుండా బీజేపీ కూడా టీడీపీ నాయకులను ఆకర్షించే పనిలో ఉండడం ఇలా అన్ని పరిణామాలతో టీడీపీ నాయకులు ఒక్కొక్కరిగా బీజేపీలోకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు.ఇలా పార్టీకి చెందిన నాయకులంతా ఇతర పార్టీలోకి జంప్ చేస్తుండడంతో టీడీపీ అధినేత అంతర్మథనంలో పడిపోయాడు.

ఈ పరిణామాలన్నిటి నుంచి బయటపడాలంటే బీజీపీకి దగ్గరవ్వడం ఒక్కటే మార్గమని చంద్రబాబు డిసైడ్ అయిపోయాడు.

బీజేపీ వైపు బాబు చూపులు రియాక్షన్ వేరేగా ఉందే -Political-Telugu Tollywood Photo Image

  ఈ పరిమాణాల నేపథ్యంలోనే బీజేపీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లనే టీడీపీ ఓటమి పాలైందన్న విషయం చంద్రబాబుకు బాగా అర్ధమయ్యే ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లేందుకు బాబు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీతో విభేదించామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని చంద్రబాబు అనడం ఆ నిర్ణయంతో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోడానికి కారణమైందని చెప్పి చర్చకు దారి తీశాయి.

పరోక్షంగా తాను బీజేపీ మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు.అయితే ఈ విషయంలో బీజేపీ రియాక్షన్ మాత్రం వేరేలా ఉంది.

  తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ తో జతకట్టేది లేదనే విషయాన్ని బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ ధీయోధర్ ద్వారా చెప్పించేసింది.అసలు టీడీపీతో జత కట్టే ప్రసక్తే లేదని సునీల్ ధియోధర్ ప్రకటించేశారు.టీడీపీకి బీజేపీ ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయని తేల్చి చెప్పారాయన అటు వైసీపీ, జనసేన పార్టీలతోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చేసారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవరితోనూ పొత్తులేదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి నివేదిక తయారు చేశామని, ఆ నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు ఇస్తామని చెప్పుకొచ్చారు.బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంటే బీజేపీ మాత్రం దూరం దూరం జరుగుతుండడం బాబు లో మరింత అసహనాన్ని కలిగిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Bjp Incharge Sunil Deodhar Comments On Chandrababu Related Telugu News,Photos/Pics,Images..

footer-test