ఏపీ బీజేపీలో కుమ్ములాట మొదలయ్యిందా ?  

Ap Bjp Faced Group Politics-

నాయకులందు బీజేపీ నాయకులు వేరయా అన్నట్టుగా బీజేపీ నేతలు క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు.తమ అధిష్టానం చెప్పిందే వేదం లా పనిచేసుకుంటూ వెళ్లిపోతుంటారు.పార్టీ స్టాండ్ తప్ప తమ సొంత నిర్ణయాలు ఏవీ బయటపడకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు గాడి తప్పినట్టు కనిపిస్తున్నారు.

Ap Bjp Faced Group Politics- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ap Bjp Faced Group Politics--Ap Bjp Faced Group Politics-

ముఖ్యంగా ఏపీ బీజేపీలో ఆధిపత్య పోరు ఎక్కువ అవ్వడంతో పాటు గ్రూపు రాజకీయాలు పెరిగినట్టుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఏపీ బీజేపీలో మూడు నాలుగు గ్రూపులు గా ఉన్నాయి.ప్రస్తుతం సోము వీర్రాజు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీల హవా ప్రస్తుతం ఏపీలో ఎక్కువగా నడుస్తోంది.

Ap Bjp Faced Group Politics- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ap Bjp Faced Group Politics--Ap Bjp Faced Group Politics-

ఆ నాయకులతో సాన్నిహిత్యం నెరుపుతూ టీడీపీకి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు కన్నా లక్ష్మి నారాయణ.ఈ నేపధ్యంలో మొదటి నుంచి బీజేపీలో బాబు సానుభూతిపరులను వ్యతిరేకిస్తూ వస్తున్న సోము వీర్రాజు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో ఆయన అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ ను కలవడం సంచలనం సృష్టిస్తోంది.అంతే కాదు వైసీపీ ప్రభుత్వ విధానాలకు మద్దతుగా సోము మాట్లాడడంతో పాటు, బాబు పాలనలో విద్య, వైద్య రంగాల్లో పెద్ద అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం కన్నాకు నచ్చడంలేదట.

ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు పరోక్షంగా యుద్ధం చేసుంటున్నారట.ఇక సోము వీర్రాజు త్వరలోనే బీజేపీని వదిలి వైసీపీ లో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా కన్నా వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.అయితే ఈ ఇద్దరి మధ్య బీజేపీ పెద్దలు రాజీ చేస్తారో లేక ఎవరి ఇష్టం వారిది అన్నట్టుగా వదిలేస్తారా చూడాలి.