ఏమాటకామాటే చెప్పుకోవాలి.రాజకీయాల్లో ఉన్నామంటే.
గెలిచామా.పదవులు తెచ్చుకున్నామా? అనేకా దు.ఒకింత ప్రజలకు ఏదైనా చేయాలనే ధ్యాస కూడా ఉండాలి.పైగా… ఇప్పుడున్న అధికార పార్టీలో ఎవరూ పెద్దగా నేరుగా ప్రజల్లోకి రావడం లేదు.వచ్చినా.పైపైనే చూసి వెళ్లిపోతున్నారు.సమస్యలు తెలిసి కూడా మౌనం పాటిస్తున్నారు.కానీ.
తాజాగా పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన.ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి.
తమ్మినేని వాణిశ్రీ.నేరుగా.రంగంలోకి దిగిపోయారు.క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులు తెలుసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని తొగరాం పంచాయతీ సర్పంచ్‌గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వాణిశ్రీ.ఆ పంచాయతీలోని తమ్మయ్యపేట గ్రామంలో తాజాగా పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ వాణిశ్రీ సందర్శించారు.పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినలేకపోతున్నారని తల్లిదండ్రులు సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు.
భోజనాన్ని పరిశీలించిన ఆమె వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా స్పీకర్ సతీమణి వాణి శ్రీ చేసిన వ్యాఖ్యలు.
చాలా ఆసక్తిగా ఉన్నాయి.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి.సంబంధిత అధికారికి ఫోన్ చేసిన వాణిశ్రీ ఏమన్నారంటే.
“నేను తమ్మయ్యపేట గ్రామంలో ఉన్నాను.ఇక్కడ స్కూల్లో.పిల్లలకు పెడుతున్న ఫుడ్డేటి.ఈ సంకటేటి? వచ్చేస్తావా(అధికారిని).నువ్వు.
భోజనం చేసేద్దామా? అన్నం మెతుకు.మెతుకు అంటడం లేదు.
హల్వా అని ఇచ్చేసి.పప్పు అన్నం కలిపి పులగం వడేసి పెట్టేసినావు.
రెండు జీడిపప్పు ముక్కలేశావు.ఏటి సాంబారేటి.
ఇది సాంబారా… నీళ్లా.రసమా.? నీ పిల్లలకి నువ్వు.ఇంట్లో ఇలగే తింటాన్రా మీరు.
నీకు వాట్సాప్ పెడతాను చూడు!. మొన్న కూడా పేపర్‌లో వచ్చింది.
మొన్నకూడా చెప్పాను.అయినా సెట్‌రైట్ అవడం లేదు మీరు.
సెట్‌రైట్ అవడం లేదు మీరు(ఆగ్రహం).నాకు పది సార్లు మాట్లాడ్డం రాదు.
యాక్షన్‌లోకి దిగిపోతాను“ అని హెచ్చరించారు.

అంతేకాదు.తనదైన శైలిలో ఆమె వ్యాఖ్యానించారు.“గవర్నమెంట్ నుంచి కోట్లేమోదీననికోసం ఖర్చు చేస్తుంటే.మీరేమో.ఇలాంటి ఫుడ్డు పిల్లలకు పెడితే… ఎలాగ? ఎలాక్కనిపిస్తన్నాం.రమ్మనవయ్యా.మీ హెడ్డాఫిది డిపార్ట్‌మెంట్‌ను తింటాడేమో అడుగుతాను.
మీరు ఫైస్టార్ హోటల్‌లో తింటారు.మేమేమో.
ఇక్కడున్నోళ్ల ఎదవలమేంటి మేం.నేను విజయవాడ వెళ్లి సీఎంను కలుస్తా, ఈ విషయంపై యాక్షన్‌లోకి వెళ్లిపోతా.ఫొటోలు తీసుకున్నా.“ అని వ్యాఖ్యానించారు.మొత్తానికి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మధ్యాహ్న భోజన లోపాలను స్పీకర్ సతీమణే స్వయంగా వెలుగులోకి తీసుకురావడం సంచలనంగా మారింది.మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.