ఉపరాష్ట్రపతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని  

Ap Assembly Speaker Tammineni Comments On Vice President-

ప్రస్తుతం ఏపీ లో బిజెపి ఫిరాయింపుల పర్వంకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.గతంలో టిడిపి ఆపరేషన్ ఆకర్ష పేరుతో వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకుంది.

Ap Assembly Speaker Tammineni Comments On Vice President--AP Assembly Speaker Tammineni Comments On Vice President-

అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్ భారీ ఆధిక్యంతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.ప్రస్తుతం టిడిపిని నాయకత్వ సమస్య వెంటాడుతుంది.చంద్రబాబు నాయుడు ఉన్న అతను ఎమ్మెల్యేలను నియంత్రించే స్థాయిలో పనిచేయడం లేదని మాట వినిపిస్తోంది.

Ap Assembly Speaker Tammineni Comments On Vice President--AP Assembly Speaker Tammineni Comments On Vice President-

ఇక పార్టీపై నారా లోకేష్ పెత్తనం కూడా పెరగడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారం కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో టిడిపి నేతలు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపించిన జగన్ విముఖత వ్యక్తం చేశాడు.

దీంతో వాళ్లంతా బీజేపీ కండువా కప్పుకోవడం మొదలుపెట్టారు.దీనికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులకు ఓకే చెప్పడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఉప రాష్ట్రపతి హోదాలో రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

నైతికంగా చూస్తే ఆయన చేసింది కచ్చితంగా తప్పు అని తమ్మినేని వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బిజెపి పార్టీకి తగిలినట్లయింది.