సైబరాబాద్ సీపీ సజ్జనార్ ని ప్రశంసించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్..!!

అప్పట్లో దిశ కేసుకు సంబంధించి నిందితులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఎన్కౌంటర్ చేసిన ఘటనపై తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశంసల వర్షం కురిపించారు.ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో దిశ యాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Ap Assembly Speaker Praises Cyberabad Cp Sajjanar-TeluguStop.com

ప్రస్తుత సమాజంలో స్త్రీ పై పురుషులు ఆలోచనలు మారాలని సూచించారు.సమాజంలో లో రోజు రోజుకి పురుషులు మృగాలు గా మారిపోతున్నాయి అని అటువంటి మృగాలు గా మారిన మగవాళ్ళను క్షమించకూడదు అని పేర్కొన్నారు.

ఇదే రీతిలో మృగాలుగా మారి ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అవసరమైతే చట్టాలను పక్కనపెట్టి వేటాడాల్సిన అవసరం ఉందని సూచించారు.సమాజంలో రక్షణ గా ఉండాల్సిన మగవాడే మృగంలా మారితే సమాజం ఏమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Ap Assembly Speaker Praises Cyberabad Cp Sajjanar-సైబరాబాద్ సీపీ సజ్జనార్ ని ప్రశంసించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు అత్యాచారానికి పాల్పడేవారిని భూమిపై ఉంచకూడదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా రాముడు కృష్ణుడు లాంటి తిరిగిన ఇటువంటి భూమిలో దుర్మార్గాలు ఏంటి అంటూ తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే రీతిలో చిన్నవయసులోనే పసిపిల్లలను చంపేసే పరిస్థితుల్లోకి కన్న తల్లిదండ్రులు మారిపోతున్నారని ఇటువంటి ఘటనలు సమాజంలో దారుణం అంటూ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు.

#APAssembly #TamineniSeetha #Encounters #CyberabadCP #APAssembly

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు