వాడి వేడి : ఏపీ అసెంబ్లీ లో రచ్చ తప్పదా ?

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య వాడివేడిగా చర్చలు నడిచే అవకాశం కనిపిస్తోంది.ప్రధానంగా వైసిపి ఈ ఆరు నెలల కాలంలో చేసిన పరిపాలన పై ప్రధానంగా తీవ్రమైన చర్చ నడిచే అవకాశం కనిపిస్తోంది.

 Ap Assembly Meetings Start Today Onwards-TeluguStop.com

ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో తాము చేసిన అభివృద్ధి, ఈ నాలుగున్నరేళ్లలో చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెప్పుకునే అవకాశం కనిపిస్తోంది.ఇక ప్రతిపక్షాలు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలను హైలెట్ చేసుకుని ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.

ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని అధికార పార్టీ చూస్తోంది.అవసరమైతే మరికొన్ని రోజులపాటు పొడిగించాలని చూస్తున్నారు.

Telugu Ap Assembly, Apassembly, Ap, Tdp Chandrababu, Ycpfoucs, Ycpjagan-

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే నవరత్నాలు పేరుతో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చమని ఇంకా మరికొన్ని హామీలు అమలు చేయబోతున్నామని, ఇలా ఒక్కో పథకం గురించి చెప్పుకునే ప్రయత్నం చేయబోతోంది.ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశం నిర్వహిస్తోంది.ఈ సమావేశానికి సీఎం జగన్ ,ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరవుతున్నారు.ఇక్కడే సభా వ్యవహారాలు, ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని అనే విషయంపై చర్చించ బోతున్నారు.

Telugu Ap Assembly, Apassembly, Ap, Tdp Chandrababu, Ycpfoucs, Ycpjagan-

అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధానంగా ఎత్తిచూపి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.ఆరు నెలల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తే, అధికార పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది.బయట ప్రెస్‌మీట్లలోనే మంత్రులు విపక్షాలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడుతున్నారు.అసెంబ్లీలో మరింత కంట్రోల్ దాటిపోయేవిధంగా ప్రవర్తిస్తున్నారు.దీన్నే టీడీపీ అస్త్రంగా చేసుకోబోతోంది.తమ వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేక విమర్శల దాడికి దిగుతుండడంతో దీనినే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తోంది.

ఇలా ఎవరికి వారు సభలో పై చేయి సాదించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube