ఎన్టీఆర్ పై ఫైర్ అయిన అభిమాని.. స్పందించే పద్ధతి ఇదేనా అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వీడియోను రిలీజ్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి చేసిన కామెంట్లపై స్పందించిన సంగతి తెలిసిందే.ఈ ఘటన తన మనస్సును కలచివేసిందని రాజకీయాలలో వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

 Ap Assembly Chandrababu Family Junior Ntr Fans Fire , Ap Assembly , Chandrababu-TeluguStop.com

మాట అనేది వ్యక్తిత్వానికి ప్రమాణమని ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనస్సును కలచివేసిందని ఎన్టీఆర్ అన్నారు.

ఎప్పుడైతే ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో పరుష పదజాలంతో ఆడపడుచుల గురించి మాట్లాడుతున్నామో అదొక అరాచక పాలనకు నాంది అవుతుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని ఈ సాంప్రదాయం రక్తంలో, నవనాడులలో ఇమిడిపోయిన సాంప్రదాయం అని కుటుంబ సభ్యుడిగా తాను ఈ విషయాలను చెప్పడం లేదని సాటి తెలుగువాడిగా చెబుతున్నానని ఎన్టీఆర్ అన్నారు.

Telugu Ap Potics, Fans, Ntr, Tdp, Tollywood, Ysrcp-Movie

అయితే ఎన్టీఆర్ స్పందించిన తీరు గురించి ఒక అభిమాని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.చంద్రబాబు ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని అభిమాని చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ ఈ ఘటన గురించి స్పందించకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిమాని కామెంట్లు చేశారు.

కర్ర విరగదు పాము చావదు అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని ఫ్యాన్ కామెంట్లు చేశారు.

Telugu Ap Potics, Fans, Ntr, Tdp, Tollywood, Ysrcp-Movie

ఎన్టీఆర్ అంటే వైబ్రేషన్ అని ఎన్టీఆర్ వీడియోలో చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారని అభిమాని అన్నారు.ఎన్టీఆర్ పేరుపై పేరు ప్రతిష్టలు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన విధానం వల్ల ఆయనపై గౌరవం పోయిందని ఎన్టీఆర్ అభిమాని తెలిపారు.అభిమాని చేసిన కామెంట్ల గురించి ఎన్టీఆర్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.త్వరలో తారక్ స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి రానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube