‘ఫ్యాను’ గాలి కార్యకర్తలకు తగలడం లేదా ?  

Ap Ap Cm Jagan Ycp Ycp Followers Jagan And Chandrababu Naidu Corona Virus Ap Politics Ycp Ministers And Mlas Ycp And Tdp - Telugu Ap, Ap Cm Jagan, Ap Politics, Corona Virus, Jagan And Chandrababu Naidu, Ycp, Ycp And Tdp, Ycp Followers, Ycp Ministers And Mla\\'s

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కనిపించినంత ఉత్సాహం, చురుకుదనం ఇప్పుడు కార్యకర్తల్లోనూ, ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ కనిపించడం లేదు.పేరుకే అధికార పార్టీ కార్యకర్తలుగా తాము కొనసాగుతున్నమని, పెత్తనమంతా అధికారులు చేతుల్లోనే పెట్టడంతో కార్యకర్తల్లోను, ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తికి కారణం అవుతోంది.

 Ap Ap Cm Jagan Ycp Ycp Followers Jagan And Chandrababu Naidu Corona Virus Ap Politics Ycp Ministers And Mlas Ycp And Tdp

వాస్తవంగా వైసిపి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారు.ప్రజల నుంచి కూడా జగన్ పాలన పై సానుకూల దృక్పథం ఏర్పడింది.

అయితే కిందిస్థాయి నాయకుల్లో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు.పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, ఏ విషయంలోనూ తమ ప్రాధాన్యం లేకుండా, మొత్తం అధికారుల చేత పరిపాలన అంతా చేయిస్తూ తమను డమ్మీలుగా చేశారనే బాధ వైసిపి కింది స్థాయి నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

‘ఫ్యాను’ గాలి కార్యకర్తలకు తగలడం లేదా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఒకవైపు రాజకీయ ప్రత్యర్థుల నుంచి వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.మరోవైపు సొంత పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నా ఆశించినంత ఫలితం అయితే కనిపించడం లేదు.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది.ఇంటా బయటా అనేక విమర్శలు వస్తున్నాయి.ఇదే సమయంలో కరోనా వైరస్ రూపంలో మరో కొత్త చిక్కు వచ్చి పడింది.దీనిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు మొత్తం అన్ని విషయాలను పక్కన పెట్టి మరి ఈ విషయం పై జగన్ దృష్టి పెట్టారు.

దీనికోసం అధికారులకు చేదోడువాదోడుగా, పార్టీ కార్యకర్తలు, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు అండగా ఉండాలి అంటూ కరోనా విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినా కార్యకర్తల్లో స్పందన పెద్దగా కనిపించడం లేదు.

పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా తమకు ఒరిగిందేమీ లేదని, ఇప్పటి వరకు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నో కష్టాలు పడ్డామని, అయినా తనకు గుర్తింపు లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నామినేటెడ్ పదవులు ఎలాగు దక్కలేదని, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ కోసం పని చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆశ పెట్టారని , ఇప్పుడు ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయని, ఇప్పటి వరకు పార్టీ కోసం ఇంత చేసిన తమకు సరైన గుర్తింపు రావడం లేదని, ఈ సమయంలో తాము ఎందుకు పార్టీ కోసం త్యాగాలు చేయాలనే lవాదనను తెరమీదకు తెస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను, కార్యకర్తలను గుర్తించడంలో జగన్ ఫెయిల్ అయ్యారని, పార్టీ కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టిన వారికి ఏ ప్రయోజనం లేకుండా ప్రభుత్వ పథకాలు అన్ని అధికారులతో నే నడిపిస్తూ, తమకు అధికారుల అండ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా నాయకులను పట్టించుకోకపోవడంపైనా వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరి అసంతృప్తులను జగన్ ఏ విధంగా ఇస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు