1.టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ఆదివారం కొనసాగుతున్నాయి.వాయిదా తీర్మానం కోరుతూ టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు.దీంతో 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
2.స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిశీలించిన నిపుణుల బృందం

సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్( Swapnalok Complex ) లో అగ్నిప్రమాద ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది .తాజాగా స్వప్నలో కాంప్లెక్స్ జేఎన్టీయూ నిపుణుల బృందం , ప్రొఫెసర్లు ఈరోజు పరిశీలించారు.
3.మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy )ని కాంగ్రెస్ నాయకులు కలిశారు.అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
4.అయోధ్య రాముని విగ్రహానికి కర్ణాటక శిల

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య( Ayodya )ని రామ మందిరంలో రాముని విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కర్కాల నుంచి భారీ శిలాలను తరలించారు.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పట్టనుంది.శనివారం శ్రీవారిని 75,452 మంది భక్తులు దర్శించుకున్నారు.
6.కిషన్ రెడ్డి విమర్శలు

సికింద్రాబాద్ స్వప్నలోని కాంప్లెక్స్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) పరిశీలించారు.అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని, కాంప్లెక్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రతిఘటంలోనూ పేదలు అమాయకుల ప్రాణాలే పోతున్నాయని, ప్రమాదాలకు కారణమైన వారిపై జిహెచ్ఎంసి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.
7.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నాను.
8.అకాల వర్షాలపై జగన్ సమీక్ష

ఏపీలోని అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.వర్షాలు కారణంగా పంటలకు జరిగిన నష్టం పై జగన్ ఆరా తీశారు.
9.తిరువూరులో జగన్ పర్యటన
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు.ఇక్కడ జరిగే సభలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు.
10.రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష

నేడు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి( TPCC Chief Revanth Reddy ) నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు.
11.నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కెసిఆర్ నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) విమర్శించారు.నోటిఫికేషన్ రద్దు కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు.
12.ఖమ్మంలో టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
నేడు ఖమ్మంలో టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరగనుంది.ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొంటున్నారు.
13.నేడు భద్రాచలంలో.
నేడు భద్రాచలంలో పుష్కరణ నదీ జలాల తీర్థయాత్ర జరగనుంది.దేశంలోని వివిధ నదుల నుంచి తెచ్చిన నదుల తీర్థాలను ఊరేగింపుగా రామాలయం కు అర్చకులు తీసుకురానున్నారు.
14.ఉగాది వేడుకలు
ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నెల్లూరులోని కనపర్తిపాడు లో ఉగాది వేడుకలు జరగనున్నాయి.
15.శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

నేటి నుంచి శ్రీశైలం క్షేత్రంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.నేడు శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది( Ugadi ) మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
16.ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత
పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం ను అందజేశారు.
17.ఆర్టీసీ టికెట్ తో శ్రీవారి దర్శనం

తిరుపతికి టిఎస్ఆర్టిసి బస్సులో ప్రయాణించేవారు తిరుమల శ్రీవారిని సులభంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
18.భట్టి విక్రమార్క పాదయాత్ర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది.
19.అచ్చెన్న కామెంట్స్
2024 ఎన్నికల్లో పసుపు జెండా ఎగురవేస్తాం అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,320
.