న్యూస్ రౌండప్ టాప్ 20 

1.కాచిగూడ మదురై కు ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రం కాచిగూడ నుంచి మధురై కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

2.  వివేకానంద రెడ్డి హత్య కేసు

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాని సూత్రధారిగా అనుమానిస్తున్న  వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు.

3.నేడు, రేపు తీవ్ర ఎండలు

తెలంగాణలో రెండు రోజులు పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

4.ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల అర్హతలు మార్చాలి

ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతల వల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని, బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

5. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ లోకి అంబేద్కర్ విగ్రహం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

6.కోటి రూపాయలు విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన ఎస్ఆర్సి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరుపున ఏపీ ప్రసాద్, ఏవి ఆంజనేయ ప్రసాద్ కోటి రూపాయల విరాళాన్ని టిటిడి కి అందించారు.

7.కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్న అధికారులు

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్,  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

8.పువ్వాడ అజయ్ కామెంట్స్

కెసిఆర్ చెయ్యి వదిలిన వారంతా శంకరగిరి మాన్యలకు పోతారని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లను ఉద్దేశించి పువ్వాడ ఈ వ్యాఖ్యలు చేశారు.

9.జగన్ పర్యటన వాయిదా

సోమవారం ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా.దానిని వాయిదా వేసుకున్నారు.

10.టూరిజం హబ్ గా ట్యాంక్ బండ్

ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తామని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

11.కిషన్ రెడ్డి విమర్శలు

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ముందుకు వస్తున్నా.తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

12.కెసిఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు

తెలంగాణ సీఎం కేసీఆర్ హుజురాబాద్ ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.

13.వైయస్ వివేకా హత్య కేసు పై మంత్రి కామెంట్స్

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగనే ఈ కేసును సిబిఐ కి ఇవ్వమని చెప్పారని మంత్రి అన్నారు.

14.మంత్రి హరీష్ రావు పర్యటన

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

నేడు సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.

15.వైసీపీ నేతల సమావేశం

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పై తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమావేశం నిర్వహిస్తున్నారు.

16.సింహాద్రి అప్పన్న సన్నిధిలో.

Advertisement

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందన అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది

17.కర్ణాటకలో రాహుల్ పర్యటన

నేటి నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఈరోజు కోలార్ కు ఆయన రానున్నారు.జై భారత్ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

18.కెసిఆర్ కు ఆ అర్హత లేదు

దళితులకు , గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వని కేసిఆర్ కు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.

19.దీక్ష విరమించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచన

సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గ్రామంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్ రెడ్డిని ఎస్ఐ లోకేష్ అరెస్ట్ చేయడం తో, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, దీక్షను విరమించుకోవాలని సూర్యాపేట ఎస్పి ఫోన్ ద్వారా కోరారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,940 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 61,030.

తాజా వార్తలు