న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది.

నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 

2.ఖమ్మం విజయవాడ మధ్య పలు రైళ్లు రద్దు

 విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కొండపల్లి గాయనపాడు మధ్య మూడో లైను పనులు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం , విజయవాడ మీదుగా వెళ్లే పలు రైలు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 

3.11న అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రన్స్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వస్త్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ స్పాట్ రిజిస్ట్రేషన్ ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఎంట్రన్స్ పరీక్షను విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 

4.గవర్నర్ తన పరిధిలో ఉండాలి : సీపీఐ

 గవర్నర్ తమిళ సై తన పరిధిలో ఉండాలని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. 

5.నిజాంసాగర్ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

 

నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ప్రాజెక్టు మూడు గేట్లు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

6.సిబిఐ , ఈడి కేసులపై పిటీషన్లు ఉపసంహరణ

  జగన్ అక్రమాస్తుల కేసులపై సిబిఐ , ఈడి కేసులు  కలిపి విచారించేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసుకున్న పిటీషన్లను విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్ , కార్మిల్ ఏషియా హోల్డింగ్స్ ఉపసంహరించుకున్నాయి. 

7.27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఈనెల 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 

8.తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద

  తుంగభద్ర జలాసానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది .దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 

9.పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి కలకలం

 

Advertisement

ఉత్తరాది రాష్ట్రాల్లో వందలాది పశువులు మృత్యువాతకు కారణమైన లంపి స్కిన్ వ్యాధి ఇప్పుడు ఏపీలోనూ కలకలం రేపుతోంది.పాడి పశువుల్లో అంటువ్యాధుల విస్తరించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. 

10.తమిళనాడులో ముగియనున్న రాహుల్ పాదయాత్ర

  కాంగ్రెస్ చేపట్టిన భారత్ జొడో యాత్ర తమిళనాడులో కొనసాగుతోంది.ఈరోజు రాత్రి కేరళలోకి రాహుల్ యాత్ర చేరనుంది. 

11.సిపిఎస్ హామీ కచ్చితంగా నెరవేరుస్తాం

 

సిపిఎస్ రద్దు హామీని కచ్చితంగా అమలు చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

12.మంత్రి నిరంజన్ రెడ్డి పై షర్మిల ఆగ్రహం

  వనపర్తి నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల టిఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు .ఎవర్రా మరదలు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

13.మావోయిస్టు దామోదర్ భార్య అరెస్ట్

 

భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ భార్య చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. 

14.చంద్రబాబు పిఏ డ్రైవర్ పై దాడి

 టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కార్ డ్రైవర్ నాగరాజు   పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

15.టిడిపి నేత వంగలపూడి అనితకు బ్యాంకు నోటీసులు

 

22 లక్షలు రుణం తీసుకుని చెల్లించలేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు  కర్ణాటక బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. 

16.తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ వెబ్ సర్వీస్ టైఅప్

  అమెజాన్ వెబ్ సర్వీస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే విధంగా ఒప్పందం కుదిరింది. 

17.భారత్ లో కరోనా

 

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.  ప్రపంచ ఆత్మహత్య దినోత్సవం సందర్భంగా

  ప్రపంచ ఆత్మహత్య దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్, సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ లో ర్యాలీ నిర్వహించారు. 

19.గిరిజన రైతులకు కోడె దూడలు

 

Advertisement

శ్రీ శైలం దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ సాలలోని కోడె దూడలను చెంచు, గిరిజన రైతులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అందించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -  46,600   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,880.

తాజా వార్తలు