న్యూస్ రౌండప్ టాప్ 20

1.బెంగళూరులో మాస్కు తప్పని సరి

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

2.కోనసీమ లో క్రాఫ్ హాలిడే ప్రకటన

  రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కోనసీమ రైతు పరిరక్షణ సమితి క్రాప్ హాలిడే కు పిలుపునిచ్చింది. 

3.సి ఎస్, డీజీపీ కి మహిళా కమిషన్ నోటీసులు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

జూబ్లీహిల్స్ అమ్నిషియ పబ్ లైంగిక దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది .తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, బిజెపి మహేందర్ రెడ్డి లకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. 

4.పోలీస్ స్టేషన్ ల ముట్టడికి బీజేపీ పిలుపు

  జూబ్లీహిల్స్ లో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా బీజేపీ రేపు హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ల ముట్టడికి పిలుపునిచ్చింది. 

5.హైదరాబాద్ లో పెరుగుతున్న కొవిడ్ ఫోర్త్ వేవ్

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.రెండు వారాలుగా దేశవ్యాప్తంగా నే కాకుండా తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 

6.ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది .డిజిపికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. 

7.కొడాలి నాని కి సవాల్

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.టిడిపి హయాంలో గుడివాడ అభివృద్ధి పై చర్చకు రావాలని సవాల్ విసిరారు. 

8.మంత్రి అంబటి పై సిఐడికి ఫిర్యాదు ఆలోచనలో దేవినేని ఉమా

  తనపై తప్పుడు ట్వీట్ చేసిన మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు చేయనున్నారు. 

9.బెజవాడ దుర్గమ్మ ని దర్శించుకున్న జేపీ నడ్డా

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెజవాడ దుర్గమ్మ ను దర్శించుకున్నారు. 

10.పెద్దపులి సమాచారం

  కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడులో కలకలం సృష్టిస్తున్న పెద్ద పులి సంచారం తాజాగా అటవీశాఖ అధికారులు అప్ డేట్ ఇచ్చారు.ప్రస్తుతం పెద్దపులి పత్తిపాడు మండలం పాండవుల పాదంలో సంచరిస్తున్నట్లు  ప్రకటించారు. 

11.  నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.వైసీపీ బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయగా టిడిపి మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. 

12.ఏపీకి నైరుతి రుతుపవనాలు

  నేటి సాయంత్రానికి ఏపీకి నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

13.నేడు బిజెపి గోదావరి గర్జన

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

నేడు రాజమండ్రి లో బిజెపి గోదావరి గర్జన సభ జరగనుంది. 

14.జగన్ పర్యటన

  పలనాడు, గుంటూరు జిల్లా లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. 

15.పవన్ కళ్యాణ్ కు కె ఏ పాల్ ఆఫర్

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీ లో చేరితే ఎమ్మెల్యే గానో,ఎంపీ గానో కల్పిస్తానని అలా గెలిపించ లేకపోతే వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించారు. 

16.ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు జగన్ కు ఆహ్వానం

  ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు హాజరుకావాల్సిందిగా ఏపీ సీఎం జగన్ కు ఏసీఏ ఆహ్వానం పలికింది. 

17.వైసీపీ నేతలతో జగన్ కీలక భేటీ

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

ఎల్లుండి వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. 

18.దుబ్బాక ఎమ్మెల్యేపై కేసు నమోదు

  బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇటీవల జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటన పై కొన్ని ఫోటోలు,  వీడియోలు బయట పెట్టడం పై రఘునందన్ రావు పై కేసు నమోదైంది. 

19.నూపూర్ శర్మ కు మహారాష్ట్ర సమన్లు

Telugu Bjpraghunandan, Cmjagan, Cm Kcr, Corona, Janasena, Jp Nadda, Ka Paul, Kod

మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపూర్ శర్మ కు మహారాష్ట్ర పోలీసులు నోటీసు ఇచ్చారు.జూన్ 22వ తేదీన వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కావాలన్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,600
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,930

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube