వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు తాము వ్యతిరేకమని సిపిఐ నారాయణ( CPI Narayana ) అన్నారు.
రేపు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినా తాము పోటీకి సిద్ధంగానే ఉన్నామని తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) అన్నారు.
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తీసుకుని డీకే అరుణ అసెంబ్లీకి వచ్చారు .కానీ అక్కడ స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేదు.దీంతో ఆమె మీడియాతో మాట్లాడారు .గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపిని అసెంబ్లీ కార్యదర్శి ఇవ్వడానికి వచ్చా, కానీ స్పీకర్ , కార్యదర్శి ఎవరూ లేరు. నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పాను.
నేను వస్తున్నట్లు మెసేజ్ కూడా పెట్టాను.కానీ స్పీకర్ దగ్గర సమావేశం ఉందని వెళ్ళినట్లు కార్యదర్శి చెబుతున్నారు.హైకోర్టు తీర్పును పట్టించుకోవడంలేదని డీకే అరుణ మండిపడ్డారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తో టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు.సీనియర్ నేత అయ్యన్న తో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని చంద్రబాబు అన్నారు.
టిడిపి నేత అయ్యన్నపాత్రుడు అరెస్టుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) తీవ్రంగా స్పందించారు.అరెస్టులతో మా గొంతు నొక్క లేవు జగన్ .నీ అణిచివేతే మా తిరుగుబాటు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో నిర్వహించిన మెడికల్ పీజీ కౌన్సిలింగ్ రద్దయింది.ఇప్పటి వరకు జరిగిన మొదటి విడత కౌన్సిలింగ్ రద్దు చేస్తున్నట్లు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సిబిఐ కోర్టు కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి( Avinash Reddy ) హాజరయ్యారు.ఈ కేసులో అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ లో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది .అర్హులైన అభ్యర్థులు సంస్థ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ప్రకటించింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఉదయం సిబిఐ కోర్టుకు వచ్చారు.
విదేశీ పర్యటనకు ఎంపీ కి సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది.గతంలో డిపాజిట్ చేసిన పాస్ పార్టీ తీసుకుని వెళ్లారు.
టిడిపి యువనేత నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా లోని కొయ్యలగూడెం మండలం పొంగుటూరు క్యాంప్ సైట్ నుంచి 201వ రోజు పాదయాత్ర లోకేష్ ప్రారంభించారు.
వినాయక చవితి సెలవు ఈనెల 18 న అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఒకే దేశం ఒకేసారి ఎన్నికలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది.
41 ఏ నోటీసు ఇచ్చి మాజీ మంత్రి , టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని పోలీసులు విడిచి పెట్టారు.
సీఎం వైఎస్ జగన్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు( Harish Rao ) అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం చెన్నై కు వెళ్ళింది.
తెలంగాణలో నేటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిజిపి కార్యాలయం ముట్టడికి తెలంగాణ గ్రామీణ జిల్లాల నిరుద్యోగుల ఐకాసా కు చెందిన నిరుద్యోగులు ప్రయత్నించారు.
అలిపిరి కాలినడన మరో చిరుత సంచారం శ్రీవారి భక్తులకు కలవరం కలిగించింది.
కాలిబాటలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy