న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 7646 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటలో దేశవ్యాప్తంగా కొత్తగా 3,86,452 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.అమెజాన్ ప్రైమ్ లో ‘ వకీల్ సాబ్ ‘

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వకీల్ సాబ్ సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

4.తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్ లలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

5.ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇద్దరు స్టార్ అంపైర్లు

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

భారత్కు చెందిన అంపైర్ నితిన్ మీనన్ తో పాటు,  ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు.

6.పెట్రోల్ డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి.విజయవాడ లో పెట్రోల్ ధర 96.44, డీజిల్ ధర 89.95 గా ఉంది.తెలంగాణలోని హైదరాబాద్ లో పెట్రోల్ 93.99, డీజిల్ ధర 88.05 గా నిన్న ఉంది.

7.కోవిడ్ బాధితులకు సచిన్ భారీ విరాళం

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

దేశం లో కరోనా ఎదురుచూస్తున్న నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.దీనిలో భాగంగా మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని సచిన్ ప్రకటించారు.

8.నేటితో ముగియనున్న రాత్రిపూట కర్ఫ్యూ

తెలంగాణలో ఈరోజుతో రాత్రిపూట కర్ఫ్యూ ముగియనుంది.

9.సీఎం సహాయ నిధికి ‘ నాటా ‘ 5 లక్షల సాయం

కరుణ ఉధృతమవుతున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి ( నాటా ) తెలంగాణ ప్రభుత్వానికి 5 లక్షలు అందించింది.

10.’ స్పుత్నిక్ – వి ‘ పై హెటిరో మూడో దశ పరీక్షలు

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

రష్యా వ్యాక్సిన్ .’ స్పుత్నిక్ – వి ‘ పై హెటిరో మూడో దశ పరీక్షలు నిర్వహించడానికి బయో ఫార్మా కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కు చెందిన నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

11.అమరావతి ఆందోళనలు

అమరావతి లోనే ఏపీ రాజధాని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసన దీక్ష నేటికి 500 వరకు చేరుతుంది.ఈ సందర్భంగా రాయపూడి శిబిరంలో దళితుల కష్టాలపై పాటల సీడీని జేఏసీ నేతలు విడుదల చేశారు.

12.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది నిన్న పదివేల లోపు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

13.శ్రీశైలంలో నేడు కుంభోశ్చవం

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం లో ఈరోజు  కుంభోశ్చవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

14.చెట్లు నరికినందుకు 1.21 కోట్ల జరిమానా

అటవీ శాఖ పరిధిలోని చెట్లను నరికి నందుకు మధ్య ప్రదేశ్ అటవీ శాఖ ఓ వ్యక్తి కి 1.21 కోట్ల జరిమానా ను విధించింది.

15.హీరో సిద్ధార్థ కు బెదిరింపులు

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన హీరో సిద్ధార్థ కు బీజేపీ శ్రేణుల నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి ఈ విషయాన్ని  సిద్దార్ధ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

16.సింగరేణిలో ఆక్సిజన్ ఉత్పత్తి

ఆక్సిజన్ కొరత నపథ్యంలో సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది.సొంతంగా ఆక్సిజన్ తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించింది.

17.చార్ ధామ్ యాత్ర వాయిదా

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన చార్ ధామ్ యాత్రన కోడ్ కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాయిదా వేసింది.

18.భారత్ కు 40 దేశాల అండ

కరుణ భారత్ లో తీవ్రంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40కి పైగా దేశాలు వివిధ రూపాల్లో భారత్ కు సహాయాన్ని అందిస్తున్నాయి.

19.కరోనాతో మాజీ అటార్నీ జనరల్ సోలి సొరబ్జి మృతి

Telugu Generalsoli, India, Sputnik, Gold, Top, Vakeelsab-Latest News - Telugu

భారత ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ (91) కరోనా తో మృతి చెందారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,170

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,170.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube