న్యూస్ రౌండప్ టాప్ -20

1.పాలాభిషేకం తో ఎమ్మెల్యేపై వినూత్న నిరసన

తెలంగాణ లోని సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి రవితేజ అనే వ్యక్తి నిరసన తెలిపారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 8061 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.ఈ – రైతు వెబ్ సైట్

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

రాబోయే రోజుల్లో ఈ – రైతు వెబ్ సైట్ రూపొందించి దాని ద్వారా రైతులకు వ్యవసాయ సూచనలు అందించేందుకు గాను ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ -ప్రతిమ అగ్రి సర్వీసెస్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

4.తెలంగాణలో తేలికపాటి వర్షాలు

తెలంగాణలో బుధ గురువారాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక వస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

5.సీఏ ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు వాయిదా

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

మే నెలలో జరగాల్సిన సీఏ ఇంటర్ , ఫైనల్ ఇయర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

6.సైబరాబాద్ లో టెలిమెడిసిన్ సేవలు

కరోనా పై ప్రజల్లో అనుమానాలు , అపోహలను,  భయాలను పోగొట్టేందుకు సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సైబరాబాద్ పోలీసులు టెలిమెడిసిన్ సేవలను ప్రారంభించారు.

7.అమెరికా వీసాలు బంద్

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

అమెరికా వీసాలపై కరోనా ప్రభావం పడింది.భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఇక్కడి నుంచి వచ్చే వారికి ఆ ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది.

8.జగనన్న వసతి దీవెన ప్రారంభం

జగనన్న వసతి దీవెన పథకం ను ఏపీ సీఎం జగన్ నేడు ప్రారంభించారు.

9.కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల ధర్నా

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదుట నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్ ధర్నాకు దిగారు.ఆగిరిపల్లి మండలం లో ఓ వివాదంలో పోలీసులు స్పందించకపోవడం పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు.

10.ఏపీలో కరోనా

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

ఏపీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,434 కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.మూడు నెలల్లో అందరికీ టీకా

తెలంగాణలో కరుణ వ్యాక్సినేషన్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

12.ముగిసిన భద్రాద్రి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం నిర్వహించిన వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

13.ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నేడు సమావేశం కానుంది.

14.అమర్ నాథ్ యాత్ర రద్దు పై నిర్ణయం తీసుకోలేదు

అమర్నాథ్ యాత్రను రద్దు చేయడం పై తుది నిర్ణయం తీసుకోలేదని శ్రీ అమర్నాథ్ స్ట్రైన్ వర్గాలు తెలిపాయి.

15.కోవిడ్ పై అమిత్ షా కీలక సమీక్ష సమావేశం

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

కోవిడ్ పరిస్థితి పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సాయంత్రం నాలుగు గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

16.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,60,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.అసోం లో భూకంపం

అస్సాం లోని గౌహతి తో పాటు పలు ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది దీని తీవ్రత 6.4 గా నమోదయింది.

18.భారత్ కు స్పుత్నిక్ – వి

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ – వి దోస్తుల మొదటి మ్యాచ్ మే 1న భారత్ కు చేరనుంది .

19.బురఖా ధరించడం పై నిషేధం

బురఖా ధరించడం పై శ్రీలంక సంచలన నిర్ణయం తీసుకుంది.బుర్క సహా మొహం కనిపించకుండా ధరించే ఏ విధమైన వస్త్రాలను పబ్లిక్ గా ధరించ కూడదు అని శ్రీలంకలో ఒక ప్రతిపాదన రావడం తో దానికి ఆ దేశ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Amith Sha, Corona India, Website, Meka Pratap, Sputnik, Gold, Top-Latest

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,790

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,790.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube