న్యూస్ రౌండప్ టాప్ 20

1.కఠినంగా లాక్ డౌన్ అమలు

హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామని నగర కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.టిడిపి డిజిటల్ మహానాడు ప్రారంభం

తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది.

3.ఈటెలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోదండరాం భేటీ

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ గురువారం ఈటెల నివాసంలో సమావేశమయ్యారు.

4.ఓయూ రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ

ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.

5.పీహెచ్సీ కోర్సులకు దరఖాస్తు గడువు పొడిగింపు

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

అంబేద్కర్ న్యాయ విశ్వవిద్యాలయంల పీహెచ్డీ కోర్సులకు సంబంధించి విద్యార్థుల అడ్మిషన్ గడువు పొడగించారు.ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుండగా , దానిని జూన్ 30 వరకు పొడిగించారు.

6.వివేకానంద విదేశీ విద్య దరఖాస్తు గడువు జూన్ 18

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వివేకానంద విదేశీ విద్యా పథకం దరఖాస్తు గడువు జూన్ 18 వరకు పెంచింది.

7.కోవేట్ పరీక్ష నిర్ధారణ వాహనం ప్రారంభం

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

కోవిడ్ పరీక్ష నిర్ధారణ వాహనాన్ని ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం మండలం లో ఆయన ప్రారంభించారు.

8.ఆన్లైన్ లో  ఆర్టిఏ సేవలు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్ విధానంలో సేవలందించాలని రవాణా శాఖ నిర్ణయించింది.

9.వ్యవసాయ డిప్లమో ప్రవేశ అర్హతల్లో మార్పులు

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ, అగ్రి ఇంజనీరింగ్, ఆర్గానిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి అర్హత లో మార్పులు చేస్తూ ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయ అకాడమీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు.

10.జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు

ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 2021 22 విద్యా సంవత్సరంలో మొదటి దశ ప్రవేశాలను మంగళవారం నుంచి తెలంగాణ ఇంటర్ బోర్డ్ శ్రీకారం చుట్టింది.జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది.

11.ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన రఘురామ

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

నిన్న ఢిల్లీ వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.

12.చెన్నై సేలం విమానాలు మళ్లీ రద్దు

చెన్నై సేలం విమాన సేవలు మళ్లీ రద్దయ్యాయి.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో,  ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం తో ఈ విమాన సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

13.భారత్ లో కరోనా

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,11,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.కరోనా పరిస్థితులపై ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

కరోనా పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది.డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఈ భేటీని నిర్వహిస్తున్నారు.

15.పడవ మునక 150 మంది గల్లంతు

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

నైజీరియా దేశంలో ప్రమాదవశాత్తు పడవ నది లో మునిగిన దుర్ఘటనలో నూట యాభై మంది వరకు ప్రయాణికులు గల్లంతయ్యారు.

16.కేంద్రంపై కోర్టుకు వెళ్లిన వాట్సాప్

కేంద్రం సోషల్ మీడియా సంస్థల మధ్య కొంత కాలంగా వివాదం జరుగుతూనే ఉంది.కేంద్రం ఇచ్చిన గడువు పూర్తవడంతో సోషల్ మీడియా సంస్థలు అన్ని వివరాలతో స్పందించాలని కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది దీనిపై వాట్సప్ కోర్టుకు వెళ్ళింది.

17.ఆనందయ్య పై ఒక ఫిర్యాదు లేదు : సోమిరెడ్డి

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

కరోనాకు మందు ఇస్తున్న bongai ఆనంద్రె మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోక పోవడం దురదృష్టకరమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.40 ఏళ్లలో ఆనందయ్య పై ఒక్క ఫిర్యాదు లేదని సోమి రెడ్డి చెప్పుకొచ్చారు.

18.సివిఆర్ అకాడమీ నుంచి ఆనందయ్య తరలింపు

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం గోపాలపురం సిబిఆర్ అకాడమీ నుంచి అనందయ్య ను పోలీసులు తరలించారు.అయితే ఆయన ఎక్కడికి తరలించారనేది తెలియక పోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.

19.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ కాస్త తగ్గింది బుధవారం శ్రీవారిని 8,984 మంది దర్శించుకున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Anamdayya, Corona India, Dr Sudhir Kumar, Etela, Kodandarami, Gold, Top-L

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,600

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,600

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube