న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేటి నుంచి జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ

చాలా రోజులుగా తమ సమస్యలను పరిష్కరించే వలసిందిగా కోరుతున్నాము అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.ఈతెల భూ వివాదంపై తాసిల్దార్ విచారణ

మెదక్ జిల్లా ముసాయి పేట మండలం అచ్చంపేట గ్రామం లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమ వ్యవహారాలపై ముసాయి పేట తహసీల్దార్ మాలతి తన కార్యాలయంలో రైతులను విచారించారు.

3.జగన్ రెడ్డి ఓ అమూల్ బేబీ : లోకేష్

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

జగన్ రెడ్డి ఓ అమూల్  బేబీ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.ఈరోజు జైలు నుంచి విడుదలైన టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర ను పరామర్శించిన సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

4.ఆనంద్ బృందంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భేటీ

నెల్లూరు జిల్లాలోని పట్టణం లో కరోనా కు మందు తీస్తున్న ఆనందయ్య శిష్యుల బృందంతో  ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు.

5.బెయిల్ రద్దు పై జగన్ కు చివరి అవకాశం

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1వ తేదీకి వాయిదా పడింది.కౌంటర్ దాఖలుకు జగన్, సిబిఐ అధికారులు గడువు కోరడంతో చివరి అవకాశం కల్పించారు.

6.నాడు – నేడు తొలిదశ 20 కి పూర్తి చేయాలి

మనబడి నాడు నేడు పథకం కింద చేపడుతున్న పనులు జూన్ 20 నాటికి పూర్తి కావాలని ఏపీ ప్రభుత్వం గడువు విధించింది.

7.వ్యాక్సిన్ కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆన్లైన్ రిజర్వేషన్ అవసరం లేదని, సమీపంలోని వాక్సిన్ సెంటర్ కు ఆధార్ కార్డుతో వెళ్తే వ్యాక్సిన్ వేస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

8.ఏపీకి మరిన్ని టీకా డోసులు

ఏపీకి మరిన్ని డోసులు వచ్చి చేరాయి.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 50 వేల కోవాగ్జిన్ టీకా డోస్ లు ఏపీకి చేరుకున్నాయి.

9.అతి తీవ్ర తుఫానుగా యాష్

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

వాయువ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ గా యాష్ కొనసాగుతోంది.ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు మధ్యాహ్నం ఉత్తర ఒరిస్సాలోని  ధర్మ, బలా నూర్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది.

10.నేటి నుంచి కోవాగ్జిన్ రెండో డోసు

రాష్ట్రవ్యాప్తంగా బుధ గురువారాల్లో రెండో వేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ తెలిపారు.

11.ఢిల్లీకి రఘు రామ కృష్ణంరాజు

ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్ అయ్యారు.వెంటనే ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

12.భారత్ లో కరోనా

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,08,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.విమానంలో పెళ్లి.స్పైస్ జెడ్ సిబ్బంది సస్పెన్షన్

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

ఎగిరే విమానం లో మధు రైతు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడి వివాహం జరగడం వైరల్ అయింది.ఒకే విమానంలో 150 మంది ప్రయాణించి ఈ వివాహ వేడుకల్లో పాల్గొనడం తో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన కింద  ఆ విమాన సర్వీసు సంస్థ స్పైస్జెట్ సిబ్బందిని సస్పెండ్ చేసింది.

14.ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగింపు

ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ నెల 31 వరకు 12 ప్రత్యేక రైళ్లను రద్దు చేయగా, ఈ రద్దు ను జూన్ 15వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

15.క్షీణించిన మాజీ సీఎం ఆరోగ్యం

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చేరారు.

16.కరోనాతో 513 మంది డాక్టర్ల మృతి

కరోనా సెకండ్ వేవ్ లో ఆ ప్రభావానికి గురై మరణిస్తున్న డాక్టర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది .ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 513 మంది డాక్టర్లు ఈ వైరస్ ప్రభావం కారణంగా మృతి చెందారు.

17.సిబిఐ డైరెక్టర్ గా శుబోధ్ కుమార్

సి.బి.ఐ నూతన డైరెక్టర్ గా సీఐఎస్ఎఫ్ చీఫ్ శుభోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు.

18.త్వరలో డబ్ల్యుహెచ్ఓ జబితాలోకి కోవాగ్జిన్

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

సెప్టెంబర్ 1 నాటికి డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ వాక్సిన్ ల జాబితా లోకి కో చేరబోతోంది.

19.జూలై 1 నుంచి ఇంటర్ పరీక్షలు

12వ తరగతి పరీక్షలను ప్రస్తుత విధానంలో జూలై ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గుజరాత్ విద్యా శాఖ మంత్రి  భూపేందర్ తెలిపారు.

20.గూగుల్ కి 40 లక్షల ఫైన్

Telugu Ash Storm, Bhupender, Etela Rajendar, Gooogle, Jagan, Lokesh, Gold, Top-L

అమెరికా ఆధారిత గూగుల్ సంస్థకు రష్యా కోర్టు 6 మిలియన్ రూబిల్స్  (40  లక్షల ) జరిమానా విధించింది.

21.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,100

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,300

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube