న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలో కి అనుమతి

తెలంగాణలో పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలను కఠినతరం చేశారు ఈ పాస్ ఉంటేనే ఇతర రాష్ట్రాల్లోని వారిని తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.రెండు అంబులెన్సులు ఇచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కరోనా బాధితులకు ఉచిత సర్వీస్ అందించే నిమిత్తం రెండు అంబులెన్సులను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చారు ఈ అంబులెన్సులను ఈరోజు సాయంత్రం మూడు గంటలకు  గాంధీభవన్ లో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు.

3.ఈటెల భూకబ్జా వ్యవహారంపై  మరో ఫిర్యాదు

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కు మరో ఫిర్యాదు అందింది.ఈటెల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామం నివాసి పీట్ల మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

4.12వ రోజుకు చేరుకున్న లాక్ డౌన్

తెలంగాణలో లాక్ డౌన్ 12వ రోజుకి చేరుకుంది.

5.పీఈసెట్ దరఖాస్తు గడువు పొడగింపు

వ్యాయామ విద్య కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించిన పీఈ సెట్ పరీక్ష దరఖాస్తు గడువును మరో సారి పొడిగించారు.జూన్ 5 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

6.ఓవర్సీస్ విద్యా పథకానికి దరఖాస్తులు ఆహ్వానం

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఎస్టీ విద్యార్థులకు అందించే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం జూన్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కోరింది.

7.లోకేష్ విశాఖ పర్యటన వాయిదా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ పర్యటన వాయిదా పడింది.

నేడు ఆయన సీతమ్మధార లోని డాక్టర్ సుధాకర్ నివాసానికి వెళ్లాల్సి ఉంది.అయితే లోకేష్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

8.కేసీఆర్ కు లేఖ రాసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

కరుణ కార్మికుల కూలీల రక్షణ కోసం వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి హామీ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

9.టీచర్లు అందరికీ వాక్సిన్ ఇవ్వాలి

పాఠశాలలు నేపథ్యంలో ఏపీలోని ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ ప్రభుత్వం వేయించాలని ఏపీటీఫ్ డిమాండ్ చేసింది.

10.గుంటూరు జిజిహెచ్ లో ఆక్సిజన్ ప్లాంట్

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ( జిజి హెచ్ ) లో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు.ఈ వివరాలను జిఎంసి పూర్వ విద్యార్థి డాక్టర్ కొత్తమాసు సాంబశివరావు శనివారం తెలిపారు.

11.డబ్ల్యూహెచ్ వో లిస్ట్ లో లిస్ట్ కోవాగ్జిన్ లేదు

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ డబ్ల్యూహెచ్వో లిస్ట్ లో లేకపోవడంతో ఈ వ్యాక్సిన్ డోస్ తీసుకున్నవారు ఎమర్జెన్సీ అవసరాల కోసం అమెరికా, యూరప్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడడంతో, డబ్ల్యుహెచ్వో నుంచి ఎండోర్స్ మెంట్ కోసం కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

12.భారత్ లో కరోనా

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,40,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.పది యునివర్సిటీలకు వీసీల నియామకం

తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాలకు బీసీలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

14.ఇంకా ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామ కృష్ణంరాజు

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంకా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉన్నారు.ఆయనకు బెయిల్ వచ్చినా ఆ ప్రక్రియ ఇంకా పూర్తికకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

15.శివ్ లాల్ కు ఆ అర్హత లేదు : అజహర్

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

బిసిసిఐ లో హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధిగా ఉండేందుకు శివలాల్ యాదవ్ కు అర్హత లేదని హెచ్సీయే అధ్యక్షుడు అజహరుద్దీన్ అన్నాడు.

16.రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్

ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.

17.నేడు వాయుగుండంగా అల్పపీడనం

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్ప పీడనం ఏర్పడిన నేపథ్యంలో , ఆదివారం అది బాగా బలపడి వాయుగుండంగా మారబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ నెల 26 తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందన్నారు.

18.గ్రామాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

19.ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్

Telugu Arvind Kejriwal, Corona, Telangana, Gold, Top, Wrestlersushil-Latest News

దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న మరోసారి పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,000.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube