న్యూస్ రౌండప్ టాప్ 20 

1.నేడు ఏపీ అసెంబ్లీ సమావేశం

ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు.అనంతరం వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

2.ప్రభాస్ సాలార్ మూవీలో జ్యోతిక

ప్రశాంత్ నీల్ తీస్తున్న చాలా మూవీలో ఓ కీలకమైన పాత్రకు జ్యోతిక ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

3.యాస్ తుఫాన్

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22న మరో అల్పపీడనం ఏర్పడబోతోందని, దానికి యాస్ తుఫాన్ గా నామకరణం చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

4.వైసీపీ జనసేన వర్గీయుల ఘర్షణ

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పరిధిలోని పమిడిపాడు లో వైసీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

5.కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

కరోనా వైద్యం ను ఆయుష్మాన్ భారత్ లో చేర్చిన సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీ లో కూడా చేర్చాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.

6.31 వరకు పరిశ్రమల్లో కోవిడ్ నిబంధనలు

ఏపీలో విధించిన పాక్షిక లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో పరిశ్రమల నిర్వహణకు గతంలో జారీ చేసిన నిబంధనను కూడా అప్పటి వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

7.ఇజ్రాయెల్ పై గల్ఫ్ ఆగ్రహం

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

ఇజ్రాయిల్ హమాస్ మధ్య చోటు చేసుకుంటున్న దాడులపై గల్ఫ్ అరబ్ దేశాల పౌరులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

8.కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ అభ్యంతరం

చిన్నారుల్లో కరోనా వైరస్ సింగపూర్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంపై సింగపూర్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

9.రాజస్థాన్ మాజీ సీఎం కన్నుమూత

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా (89) కన్ను మూసారు.కరోనా చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు.

10.సోను సూద్ తో క్రిష్ మూవీ

ప్రముఖ దర్శకుడు క్రిష్ సోనూసూద్ కీలక పాత్రధారిగా కథను తయారు చేశారు.ఈ కథకు సోనూసూద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో  క్రేజీ పాన్ ఇండియా మూవీ తయారు అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

11.బ్లాక్ ఫంగస్ కు మెరుగైన చికిత్స

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

బ్లాక్ ఫంగస్ బాధితులకు కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని, రోగుల నిష్పత్తికి అనుగుణంగా పడకల సంఖ్యను పెంచుతామని, బ్లాక్ కాంగ్రెస్ నోడల్ అధికారి, కోటి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.

12.కర్నూల్ లో ఎలుగుబంటి హల్ చల్

కర్నూలు జిల్లాలో ఎలగుబంటి హల్ చల్ చేస్తోంది.ఆత్మకూరు సాయిబాబా గుడి సమీపంలో ముళ్లపొదల్లో ఎలుగుబంటి దాక్కోవడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు.

13.తిరుమల సమాచారం

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నిన్న శ్రీవారిని 5,030 మంది దర్శించుకున్నారు.

14.ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్

ఫ్లాగ్ ఫంగస్ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది.ఈ మేరకు బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

15.గర్భిణులకు ఉచిత క్యాబ్ సేవలు

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

డాగ్ డౌన్ సమయంలో గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీర్చేందుకు ఉచిత సేవలను అందిస్తున్నామని యాప్ ఆధారిత భారతీయ రవాణా సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ తెలిపారు.గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లేందుకు 9177624678 నంబర్ కు కాల్ చేస్తే వారు చెప్పిన చిరునామాకు సర్వీస్ క్యాబ్ చేరుకుంటుందని తెలిపారు.

16.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 23,160 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు వాయిదా

మోడల్ స్కూల్ లో ఆరో తరగతి ప్రవేశాలు, 7,10 తరగతులు స్వీట్ల ఖాళీల భర్తీకి జూన్ 5, 6 న నిర్వహించాలనుకున్న ప్రవేశ పరీక్ష ను వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన బుధవారం తెలిపారు.

18.నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం

Telugu Arvind Kejriwal, Black Fungus, Gulf Arab, Kcr Shri, Salahuddin, Sonu Sood

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

19.కపిలతీర్థం లో చిరుతల సమాచారం

తిరుపతి కపిల తీర్థం ఆలయంలో చిరుత పిల్లలు హల్ చల్ చేస్తున్నాయి.ఆలయంలో స్వేచ్ఛగా పరుగులు పెడుతున్నాయి.కర్ఫ్యూ కారణంగా తిరుమలలో జనసంచారం తగ్గడంతో అడవి జంతువుల సంచారం పెరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,650

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,650.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube