న్యూస్ రౌండప్ టాప్ 20 

1.గాంధీ ఆస్పత్రిలో ఆంక్షలు కథనం

సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని  సందర్శించిన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.  సుప్రీంకోర్టు కు చేరిన రఘురామకృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో నిర్వహించిన మెడికల్ రిపోర్ట్ ను తెలంగాణ హైకోర్టు సుప్రీం కోర్టు కు పంపించింది.

3.కొనసాగుతున్న ఫీవర్ సర్వే

హైదరాబాద్లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది.

ఈ సర్వేలో జలుబు దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు.ఇప్పటివరకు గ్రేటర్ లో 2,37,188 మందికి ఫీవర్ సర్వే నిర్వహించారు.

4.టి ఎస్ పి ఎస్ సీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.చైర్మన్ గా ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు.

5.వాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్స్

కరుణ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్స్ పిలిచింది.ఈ టెండర్ల ద్వారా కోటి వ్యాక్సిన్ డోసులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

6.ఉదయం 6 నుంచి విద్యుత్ బిల్లుల వసూలు

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

తెలంగాణలో విద్యుత్ బిల్లు చెల్లించే వారి కోసం ఉదయం 6 గంటల నుంచి కలెక్షన్ సెంటర్లు తెరిచి ఉంచాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది.

7.రుయా ఆసుపత్రి మరణాలపై హైకోర్టులో విచారణ

తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.ఇక్కడ 50 మంది చనిపోతే, 11 మందిని ప్రభుత్వం పేర్కొనడంపై పిటిషనర్ జీబీపీ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

8.విజయ్ కాంత్ కు అస్వస్థత

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

ప్రముఖ తమిళ నటుడు డిఎంకె అధ్యక్షుడు విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు.శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ను చేర్పించారు.

9.అర్హులైన ఖైదీలను విడుదల చేయాలి : సుప్రీం

కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో దేశవ్యాప్తంగా అర్హులైన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

10.భారత్ లో కరోనా

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.యూపీలో మరో మంత్రి కన్నుమూత

ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో మంత్రి కరోనా మహమ్మారి కి బలయ్యారు.రెవెన్యూ మంత్రి విజయ్ కశ్యప్ (56) కోవేట్ కు చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

12.సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ తిరస్కరణ

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

ఒక రేజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ కు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

13.ట్యునీషియా తీరం లో మునిగిన పడవ

ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా తీరంలో వలస దారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది.ఈ ఘటనలో 50 మంది వరకు గల్లంతయ్యారు.

14.ఏపీకి చేరిన మరికొన్ని కరోనా టీకాలు

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

ఏపీకి మరికొన్ని కరోనా టీకా డోసులు చేరుకున్నాయి.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 50,000 టీకా డోసులు ఏపీకి చేరాయి.

15.ఇండియా పై మరో దేశం ఆంక్షలు

ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సూడాన్ దేశం భారత్ కు రాకపోకలపై నిషేధం విధించింది.

16.హైదరాబాద్ కేంద్రంగా మరో టీకా ఉత్పత్తి కేంద్రం

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ తో ఒప్పందం కుదిరింది.

17.అభిమానులకు ఎన్టీఆర్ బహిరంగ లేఖ

ఈసారి తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని , ఇది వేడుకలు చేసే సమయం కాదని ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు లేఖ రాశారు.

18.రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

రేపు ఏపీ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు కారణంగా ఈ సమావేశాలను ఒక రోజుకు కుదించారు.గవర్నర్ ప్రసంగం తర్వాత ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

19.సింగపూర్ లో కోవిడ్ స్ట్రైన్ కలకలం

కరోనా కొత్త స్ట్రైన్ బి.1.617 సింగపూర్ లో వెలుగుచూసింది.దీని ప్రభావంతో చిన్నారులు అత్యధిక సంఖ్యలో  పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Johnsonjohnson, Singapore, Sushil Kumar, Gold, Top, Tunisia-Latest News E

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,650

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,650

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube