న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.తెలంగాణలో కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.పశువుల మంద పై చిరుత పులి దాడి

కొమరం భీం జిల్లా లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.తాజాగా పెంచికల్ పేట మండలం లోని అగర్ గూడ లో పశువుల మందపై చిరుత దాడి చేసింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

3.తెలంగాణ లో పెరగనున్న ఎండలు

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

తెలంగాణలో ఎండలు మరింత పెరగనున్నాయి సోమ ,మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

4.కోవిడ్ రీయింబర్స్మెంట్

కరోనా బారినపడి అత్యవసరంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లు,  వారి కుటుంబ సభ్యులకు మెడికల్ రీయంబర్స్మెంట్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

5.సీఎం ఆమోదానికి పిఆర్సి ఫైల్

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ( పీఆర్సీ ) కి సీఎం కేసీఆర్ క్లియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్ కెసిఆర్ వద్దకు చేరినట్లు సమాచారం.

6.జగన్ నేతృత్వంలో హైలెవెల్ మీటింగ్

కరోనా కట్టడి చర్యలపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

7.విద్యా దీవెన తొలివిడత జమ నేడు

ఈ విద్యా సంవత్సరానికి గాను విద్యాదీవెన తొలివిడత సొమ్మును ప్రభుత్వం నేడు జమ చేయనుంది.

8.తిరుమల సమాచారం

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

కరోనా మహమ్మారి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతోంది.ఆదివారం 27,822 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

9.పోలవరం ఇసుక రీచ్ లో ఎస్ఈబీ తనిఖీలు

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం పోలవరం ఇసుక రీచ్ లో ఎస్ఈబీ తనిఖీలు నిర్వహించింది.

10.హిడ్మా ను పట్టిస్తే ఏడు లక్షలు

మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బెటాలియన్ సారధి అయిన 40 ఏళ్ల హిడ్మాను పట్టిస్తే ఏడు లక్షల రివార్డును అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకటించింది.

11.భారత్ విమానాల రాకపోకల పై నిషేధం

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది.

12.ఆల్వార్ తీర్థం పునరుద్ధరణ

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో బయటపడిన పురాతనమైన ఆల్వార్ తీర్థాన్ని రామానుజాచార్య జయంతి సందర్భంగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

13.భారత్ లో కరోనా

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,73,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనాతో 1619 మంది మృతి చెందారు.

14.అమెరికాలో 25% మందికి వ్యాక్సినేషన్ పూర్తి

అమెరికా జనాభాలో దాదాపు నాలుగు గంటల 15 మందికి కరోనా వ్యాక్సిన్ పూర్తయినట్లు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

15.ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలు దాటిన కోవిడ్ మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది ఇప్పటి వరకు కరోనా కారణంగా దాదాపు 30 లక్షల మంది వరకు ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందినట్లు తేలింది.

16.నేటి నుంచి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతున్న  నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది.ఈ మేరకు ప్రాణవాయువును సరఫరా చేసేందుకు రైల్వేశాఖ ముందుకు వచ్చింది.నేటి నుంచి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

17.బెంగాల్ లో రాహుల్ ఎన్నికల ర్యాలీల రద్దు

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు.

18.కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

బీహార్ లో కరోనా వైరస్ బారిన పడిన మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు.జేడీయూ సీనియర్ నేత బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి కరోనా ప్రభావం తో నేడు మృతిచెందారు.

19.162 ఆక్సిజన్ ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతి

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో , దేశవ్యాప్తంగా 162 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Corona India, Jagan, Rahul Gandhi, Gold, Top-Latest News English

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,020

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,020.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube