న్యూస్ రౌండప్ టాప్ - 20

1.  రెండో రోజు వైఎస్ షర్మిల దీక్ష

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 16 2021 Today-TeluguStop.com

తొలి రోజు దీక్షను ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు.ఈరోజు దీక్షను లోటస్ పాండ్ లోని తన ఇంట్లోనే షర్మిల చేపట్టారు.

2.నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

-Latest News English

ప్రముఖ డాక్టర్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు (96) ఈరోజు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 16 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ – 20-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

3.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 3,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

4.రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం

-Latest News English

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి అడుగు జాడలు బయటపడడం కలకలం సృష్టిస్తోంది.ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ లో చిరుత సంచారం ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

5.టిఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలు వాయిదా

టిఆర్ఎస్ జి దశాబ్ది ఉత్సవాలు వాయిదా పడ్డాయి.కరుణ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

6.రేపు వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం రేపు ప్రారంభం కానుంది.

7.సాగర్ ఎన్నికల తర్వాతే పిసికి కొత్త అధ్యక్షుడు ఎంపిక

-Latest News English

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ పి సి సి అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్క ఠాకూర్ తెలిపారు.

8.తప్పిపోయిన బాలలపై నివేదిక కోరిన హైకోర్టు

తప్పిపోయిన బాలలను గుర్తించి ఎంత మందిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారని తెలంగాణ హైకోర్టు అధికారులను ప్రశ్నించింది.రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలు తప్పిపోయిన కేసులు ఎన్ని నమోదయ్యాయి ? ఎన్ని కేసుల్లో పిల్లలను గుర్తించగలిగారు వంటి విషయాలు వివరిస్తూ కౌంటర్ చేయాలని స్పష్టం చేసింది.

9.జగన్ కీలక సమావేశం

-Latest News English

కరోనా నియంత్రణపై ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు.కరోనా నియంత్రణపై సీఎం ఆయా జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

10.ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ

ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

11.నరసాపురం ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం వద్ద ఓ ఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఆయింది .అయితే దీనిపై భయాందోళనలు వద్దు అని,  గ్యాస్ నిక్షేపాల సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేపట్టామని అధికారులు తెలిపారు.

12.తిరుమల సమాచారం

-Latest News English

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతుంది.గురువారం శ్రీవారిని 25,625 మంది భక్తులు దర్శించుకున్నారు.

13.టెన్త్ పరీక్షల ఫీజు గడువు 20 వరకు

జూన్ లో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది.ఎలాంటి ఆలస్యం లేకుండా ఈనెల 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు.

14.యూపీలో ఆదివారం లాక్ డౌన్

యూపీలో రోజురోజుకి కరోనా కేసు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో అక్కడ ప్రతి ఆదివారం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

15.రామ మందిరానికి విరాళాలు.15వేల చెక్కులు బౌన్స్

-Latest News English

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ సేకరించిన చెక్కు లో 15 వేల బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయి.

16.నేటితో కుంభమేళా సమాప్తం

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న పవిత్ర కుంభమేళ  లో పాల్గొన్న సాధువులు, ప్రజలకు పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్  నమోదవుతున్న నేపథ్యంలో నేటితో ఈ కుంభమేళాలో ముగించాలనే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది.

17.14 ప్రాంతీయ రేడియో స్టేషన్ల కార్యకలాపాల నిలిపివేత

బెంగళూరు ప్రధాన రేడియో ప్రసార కేంద్రం మినహా,  కర్ణాటకలోని 14 ప్రాంతీయ రేడియో స్టేషన్ ల కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రసారభారతి నిర్ణయించింది .

18.9వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

ఆరవ వేతన సంఘం సిఫార్సుల అమలు చేయాలనే డిమాండ్ తో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష నేటికి 9 వ రోజుకి చేరుకుంది.

19.దిగ్విజయ్ సింగ్ కు కరోనా

-Latest News English

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర –  44,000

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,000.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు