న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆనందయ్య మందుకు హైకోర్ట్ పర్మిషన్

ఆనంద్ బందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది గతంలో ఆనంద్ మందును ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.కరోనా బాధితులకు తక్షణమే మందులు పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.నేడు మోడీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోడీ నేడు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పీఎంవో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

3.ఏపీలో కర్ఫ్యూ పొడగింపు

ఏపీలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పగటిపూట కర్ఫ్యూను ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది.ఈనెల 11వ తేదీ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వెసులుబాటు కల్పించింది.

4.చిన్నారులపై స్వదేశీ కోవాగ్జిన్ ట్రైల్స్

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉందన్న అంచనాల మధ్య ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది.12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు అందించే ప్రక్రియ వేగవంతం చేసింది పిల్లలపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

5.ఈసీ వద్ద షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి

వైయస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్ జయంతి రోజున ఏర్పాటు చేయబోతున్నాం అని ఆ పార్టీ సమన్వయకర్త వాడుక రాజగోపాల్ తెలిపారు.ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం వద్ద పూర్తయినట్లు ఆయన తెలిపారు.

6.8న రాజీనామా 13 న బీజేపీ లోకి

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

తన ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ ఈనెల ఎనిమిదో తేదీన రాజీనామా చేయనున్నారు.ఈనెల 13న ఆయన ఢిల్లీ వెళ్లి బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.

7.వివేక కారు డ్రైవర్ ను విచారించిన సీబీఐ

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.ఈరోజు కడప కేంద్ర కార్యాలయంలో అతిథిగృహంలో సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించారు.ఈ సందర్భంగా వివేక వద్ద డ్రైవర్గా పనిచేసిన దస్తగిరిని సిబిఐ అధికారులు విచారించారు.

8.సిరిసిల్లలో పొన్నం ప్రభాకర్ సత్యాగ్రహ దీక్ష

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

సిరిసిల్ల పట్టణం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ దీక్షలో పాల్గొన్నారు.

9.జగిత్యాలలో మంత్రి కేటీఆర్ పర్యటన

వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నిమిత్తం తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు.

10.ఈటెల కు దొరకని స్పీకర్ అపాయింట్మెంట్

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్మెంట్ ఇంకా లభించలేదు నేరుగా స్పీకర్ ను కలిసి రాజీనామా చేయాలని చూస్తున్న ఆయనకు ఇంకా అనుమతి లభించలేదు.

11.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.కొద్దిరోజుల నుంచి పదివేల లోపు మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు.నిన్న ఆదివారం 12,874 మంది స్వామివారిని దర్శించుకున్నారు.

12.సాక్షి టీవీకి రఘురామ నోటీస్

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

వైసిపి రెబెల ఎంపీ రఘురామకృష్ణంరాజు సాక్షి టీవీ కి లీగల్ నోటీస్ ఇచ్చారు.తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వార్తా కథనాలు ప్రచారం చేయడంపై ఈ నోటీసులు ఇచ్చారు.

13.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,00,636  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.ఢిల్లీలో నేటి నుంచి అన్ లాక్

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

ఢిల్లీలో నేటి నుంచి అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది.సరి-బేసి విధానంలో మార్కెట్ మాల్స్ పున ప్రారంభం కానున్నాయి.

15.5జి టెక్నాలజీ సురక్షితమే

కొత్త సాంకేతిక పరిజ్ఞానం పై అపోహలు రావడం వదంతులు వ్యాప్తి చెందడం సహజమేనని సునీల్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎస్పి కొచ్చార్ అభిప్రాయపడ్డారు.నెట్వర్క్ రంగంలో 5g టెక్నాలజీ సురక్షితమైనదని, దాని వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.

16.డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు కరోనా

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

హత్య అత్యాచారం కేసులో నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న డేరా స్వచ్చ సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం కరోనా ప్రభావానికి గురి అయ్యారు.

17.ఏపీ రెవెన్యూ శాఖలో 1,148 పోస్ట్ లు

మొత్తం ఏపీ రెవెన్యూ శాఖలో 1,148 ఈ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అధికారులు తేల్చారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగంలో ఉన్న ఖాళీలను గుర్తించి భూపరిపాలన ప్రధాన కార్యాలయానికి పంపించింది.

18.పిసిసి అధ్యక్ష పదవి అడుగుతున్నా : జగ్గారెడ్డి

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

పిసిసి అధ్యక్ష పదవి అడుగుతున్నా  ఢిల్లీ చర్చలో తన పేరు ప్రస్తావన లేదు .నా పేరు లేకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

19.హైదరాబాద్ సీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు.తాను క్రైమ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిషనర్ పైనే ఉందని, సోషల్ మీడియాలో కొంత మంది హిందూ దేవతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Jagga, Mla Rajasinghe, Raghuramkrishna, Gold, Top-Latest News English

22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర – 47,510

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,510.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube