న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏబీఎన్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ

  ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సిఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో దురుద్దేశంతో తమను చేర్చారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
 

2.కరోనా బాధిత కుటుంబాలకు షర్మిల సాయం

  తెలంగాణ ఆడబిడ్డలారా.ధైర్యం కోల్పోకండి.  కరోనాతో కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన మహిళలకు అండగా ఉంటాను.వారి బాధను పంచుకోవడానికి ఆర్థికంగా నా వంతు సహాయం అందిస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు.సహాయం అవసరమైన వారు 040 48213268 నంబర్ కు ఫోన్ చేయాలని ఆమె కోరారు.
 

3.భైంసా అల్లర్ల కేసు విచారణకు ప్రత్యేక కోర్టు

  నిర్మల్ జిల్లా బైంసా అల్లర్ల కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు అయ్యింది.
 

4.విదేశాలకు వెళ్లే వారందరికీ టీకా

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  ఉన్నత విద్య కసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు అందరికీ కోవిడ్ వేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
 

5.14 వైద్య కళాశాలలకు జగన్ శంకుస్థాపన

  ఏపీ లో కొత్తగా 14 వైద్య కళాశాల నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
 

6.పోస్టాఫీసుల్లో ఉచితంగా టీకా నమోదు

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  తెలంగాణలోని పోస్టాఫీసులో కరోనా టీకా నమోదు సదుపాయం ఉచితంగా కల్పిస్తున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
 

7.ఆనందయ్య మందు పై విచారణ మూడు గంటలకు వాయిదా

ఆనంద్ హైకోర్టు విధించిన 15 నిమిషాల డెడ్ లైన్ పూర్తయిన వెంటనే విచారణ తిరిగి ప్రారంభమైంది.సీఎం వద్ద సమీక్ష జరుగుతుందని అధికారులు అంతా అక్కడే ఉన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలపడంతో మధ్యాహ్నం 3 వరకు దీనిని వాయిదా వేశారు.
 

8.పుదుచ్చేరిలో 7 వరకు లాక్ డౌన్

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో అమలులో ఉన్న సడలింపులతో కూడిన లాక్ డౌన్ జూన్ 7వ తేదీ వరకు పొడగిస్తూ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు.
 

9.గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

  ఉత్తరప్రదేశ్లోని అమపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ బిజెపి ఎమ్మెల్యే దేవేంద్ర ప్రతాప్ సింగ్ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.
 

10.నేడు జేపీ నడ్డా తో ఈటెల రాజేందర్ భేటీ

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు.
 

11.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,52,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

12.ఫుడ్ పాత్ వాసులకు కరోనా టీకాలు

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  చెన్నై మహానగరంలో నివాసం లేకుండా ఫుట్ పాత్ ల పై నివసించే వారికి కూడా కరోనా టీకాలు వేస్తామని కార్పొరేషన్ వైద్య విభాగం జాయింట్ కమిషనర్ జాన్ వర్గీస్ తెలిపారు.
 

13.అమెరికాలో తెలుగు వ్యక్తికి 20 ఏళ్ల జైలు

  అమెరికాలో చీటింగ్ కు పాల్పడిన తెలుగు వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.అక్కడ నర్సుగా ప్రాక్టీస్ చేస్తున్న త్రివిక్రమ్ రెడ్డి (39) అనే వ్యక్తి నకిలీ పిల్లలతో స్థానిక మెడికేర్ సంస్థలతోపాటు,  ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేశారనే అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో ఈ శిక్ష వివిధించింది.
 

14.భారత్ నుంచి విమాన రాకపోకల పై నిషేధం పొడగపు

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధాన్ని జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.
 

15.ఏపీ లో కర్ఫ్యూ పొడగింపు

  కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను జూన్ 10 వరకు పొడిగించింది.
 

16.కేక కోసం పైజర్ సీఈఓ కు మెయిల్

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  దేశంలో కరోనా  రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ కు ఫైజర్ ఎప్పుడు తీసుకు వస్తా అంటూ పూణే కు చెందిన ఓ వ్యక్తి సీరం సీఈ ఓ కు మెయిల్ చేశారు.దీనికి ఫైజర్ సీఈవో కూడా స్పందించి సమాధానం ఇచ్చారు.
 

17.ధూమపానంతో కరోనా ముప్పు అధికం

  పొగత్రాగడం తో కరోనా ముక్కు తీవ్రత 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
 

18.డీజీపీ పేరిట ట్విట్టర్లో నకిలీ ఖాతా

Telugu Andrapradesh, Etela Rajendar, Jagan, John Varghese, Gold, Top, Trivikram

  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సైబర్ నేరగాళ్ల బాధ తప్పలేదు.ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డిజిపి ఆంధ్రప్రదేశ్ పేరిట ట్విట్టర్ లో ఆదివారం ఖాతా ప్రారంభించారు.
 

19.అంతర్రాష్ట్ర సర్వీసులు నడవవు

  తెలంగాణ మంత్రి మండలి ఆదేశాల మేరకు తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,700   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,700      

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube