న్యూస్ రౌండప్ టాప్ 20

1.ట్విట్టర్ ఇండియా అధిపతి పై కేసు నమోదు

  ట్విట్టర్ భారత అధిపతి పై కేసు నమోదైంది.భారతదేశ భౌగోళిక చిత్రపటం పోస్ట్ పై ఉత్తర ప్రదేశ్ లో ట్విట్టర్ భారత అధిపతి మనీష్ మహేశ్వరి పై కేసు నమోదు చేశారు.
 

2.బిజెపి వద్దన్న అఖిలపక్ష భేటీకి వెళ్ళిన మోత్కుపల్లి

  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు .అయితే ఈ సమావేశానికి వెళ్ళద్దు అంటూ బీజేపీ అభ్యంతరం పెట్టిన ఆయన వెళ్లడంపై ఇప్పుడు పార్టీలో దుమారం రేగుతోంది.
 

3.ఫేస్ బుక్ గూగుల్ కు పార్లమెంటరీ కమిటీ ఆదేశాలు

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  ఈరోజు పార్లమెంటరీ కమిటీ ముందుకు ఫేస్బుక్ గూగుల్ ప్రతినిధులు రానున్నారు.త్వరలో యూట్యూబ్ ఇతర సామాజిక సంస్థలకు కూడా ఇవే ఆదేశాలు జారీ కానున్నాయి.
 

4.టిడిపి సాధన దీక్షలు

  కోవేట్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ  సాధనా దీక్షలకు పిలుపునిచ్చింది.
 

5.చార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం

  ఈ ఏడాది చార్ధామ్ యాత్ర నిర్వహణ కు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, జూలై 1 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
 

6.వన్ నేషన్ వన్ రేషన్ : రాష్ట్రాలకు సుప్రీం డెడ్ లైన్

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  జులై నాటికి అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల కోసం వన్ నేషన్ వన్ రేషన్ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
 

7.పాకిస్తాన్ లో గ్యాస్ సంక్షోభం

  పాకిస్థాన్ దేశంలో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది.పాక్ దేశంలోని రెండు రాష్ట్రాల్లోని గ్యాస్ కంపెనీలు మూసివేయడంతో జులై 5వ తేదీ వరకు పరిశ్రమలకు, సిఎన్జి కేంద్రాలకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు.
 

8.భారత్ చేరిన అమెరికా సాయం

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  అమెరికా నుంచి బయలుదేరిన అత్యవసర సహాయ పరికరాలు మంగళవారం భారత్ కు చేరుకున్నాయి.ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా దౌత్యకార్యాలయం ట్విట్టర్ లో వెల్లడించింది.
 

9.గ్రూప్ 1 అభ్యర్థులకు మోడల్ ఇంటర్వ్యూ లు

  గ్రూప్ వన్ మెయిన్స్ లో అర్హత పొందిన అభ్యర్థులకు ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా మరిన్ని రోజులు మోడల్ ఇంటర్వ్యూ నిర్వహించేందుకు షెడ్యూల్ ఇవ్వనున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
 

10.నేటి నుంచి సైబ్ హర్ మూడో దశ కార్యక్రమం

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  సైబర్ మూడో దశ కార్యక్రమం నేటి నుంచి తెలంగాణలో ప్రారంభం కానుంది.సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహనకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
 

11.జగన్ సమక్షంలో దిశ యాప్ లైవ్ డెమో

  విజయవాడ గొల్లపూడి లో మంగళవారం ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సు జరిగింది సీఎం సమక్షంలోనే వాలంటీర్లు యాప్ లైవ్ డెమో చేసి చూపించారు.యాప్ నుంచి మెసేజ్ వెళ్లిన వెంటనే భవానిపురం పోలీసులు స్పందించి నిమిషాల్లోనే లొకేషన్ కు చేరుకున్నారు.
 

12.నిర్మాత సి.కళ్యాణ్ పై కేసు నమోదు

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.భూ ఆక్రమణ వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.
 

13.కెసిఆర్ మనవడికి అంతర్జాతీయ అవార్డు

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు కేసీఆర్ మనవడు హిమన్ష్  అరుదైన ఘనత సాధించారు.2021 ఏడాదికిగాను డయానా అంతర్జాతీయ అవార్డును ఆయన దక్కించుకున్నారు.
 

14.విదేశాలకు వెళ్లే వారికి ఊరట

  విదేశాలకు వెళ్లే వారికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 11 వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరిచింది.
 

15.ఎంపీ అరవింద్ వాహనంపై దాడి

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై కోడిగుడ్లతో కొట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళం పూర్ సహకార సంఘం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నా లో పల్గొనడానికి సోమవారం గ్రామానికిరాగా పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయిస్తారు అంటూ కొంతమంది రైతులు, టిఆర్ఎస్ నాయకులు ఆయన వాహనాన్ని అడ్డుకుని దాడికి దిగారు.
 

16.అవుట్ సోర్సింగ్ పాలసీపై గైడ్లైన్స్ విడుదల

  కీలకమైన నిర్వహణ సేవలను అవుట్సోర్సింగ్ చేయరాదంటూ కోపరేటివ్ బ్యాంకులను ఆర్బిఐ ఆదేశించింది.ఈ మేరకు గైడెన్స్ ను విడుదల చేసింది.
 

17.డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ప్రకటన

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.జూలై 1 నుంచి 15 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
 

18.ఎంఐఎంకు డ్రోన్ దాడి కేసు

  జమ్ము వైమానిక స్థావరం పై గత ఆదివారం జరిగిన డ్రోన్ దాడి ఘటన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ ఐ ఏ ) కు అప్పగించింది.
 

19.ఉక్కు కార్మికుల ఒకరోజు సమ్మె

Telugu America, Kalyan, Cm Jagan, Disa App, India, Mp Aravind, Gold, Top, Youtub

  అఖిలపక్ష సంఘాల పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు ఒక రోజు సమ్మె చేపట్టారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,160   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,160. 

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube