న్యూస్ రౌండప్ టాప్ 20

1.తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పై క్రిమినల్ కేసు

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాడికొండ స్వప్న పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నెల 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు హక్కు లేకపోయినా, దొంగ ఓటు వేసినట్లు ఎన్నికల కమిషన్ విచారణలో తేలింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు ఉచిత గైడెన్స్

Telugu Amarnath Yatra, Corona India, Covid, Nagarjunasagar, Gold, Top-Latest New

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ 2020 మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులకు కృష్ణ ప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా ఇంటర్వ్యూ కోసం గైడెన్స్ ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ పి.కృష్ణ ప్రదీప్ తెలిపారు.మరిన్ని వివరాలకు 8686233879 నంబర్ ను సంప్రదించాలి అని కోరారు.

3.ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

ఇంటర్ అర్హతతో రైల్వేలు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు రైల్వేశాఖ ఆహ్వానిస్తోంది.దరఖాస్తుకు చివరి తేదీ 31-03-2021.

4.రేపు కబేళాలు ,బీఫ్ దుకాణాలు బంద్

హోలీ సందర్భంగా సోమవారం జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు బీఫ్ దుకాణాలు మూసి వేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

5.174 ఏపిపి పోస్టుల భర్తీకి అనుమతి

తెలంగాణ ప్రభుత్వం 174 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

6.గురుకులాల ఇంటర్ ప్రవేశ పరీక్ష వాయిదా

Telugu Amarnath Yatra, Corona India, Covid, Nagarjunasagar, Gold, Top-Latest New

వచ్చే నెల 4న జరగాల్సిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెట్ వాయిదా పడింది.పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని విద్యాసంస్థల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

7.‘ షి టీమ్స్ ‘ ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ

తెలంగాణలో మహిళల భద్రత కోసం ఏర్పాటైన షీ టీమ్స్ కు వచ్చే ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది.డీఎస్పీ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో హైదరాబాద్ లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

8.53 స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుల రద్దు

Telugu Amarnath Yatra, Corona India, Covid, Nagarjunasagar, Gold, Top-Latest New

తెలంగాణలో 53 స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో సేవలు ఏప్రిల్ 1 నుంచి నిలుపుదల చేస్తూ తెలంగాణ న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంది.

9.పదవీ విరమణ ఇక 61 ఏళ్లు

తెలంగాణలో విద్య ఉద్యోగ ఉపాధ్యాయుల పదవి విరమణ కాలాన్ని 61 ఏళ్లకు పెంచే తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం 1984 కు గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు.

10.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.ఎడ్ల బండి పోటీలను అడ్డుకున్న పోలీసులు

Telugu Amarnath Yatra, Corona India, Covid, Nagarjunasagar, Gold, Top-Latest New

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం లో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు అయితే ఈ పోటీలను పోలీసులు అడ్డుకున్నారు.పోలవరం గట్టుపై పోటీలు నిర్వహించడం ప్రమాదమని ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అడ్డుకున్నారు.

12.బీజేపీ సాగర్ అభ్యర్థి నేడు ప్రకటన

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల లో బిజెపి తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరును ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది.

13.స్థానిక ప్రజా ప్రతినిధులకు 31 నుంచి వర్క్ షాప్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన నగర మేయర్లు, డిప్యూటీ మేయర్లు,  మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్ లు, చైర్ పర్సన్ లు, డిప్యూటీ చైర్మన్ లు, చైర్ పర్సన్ లకు ఈ నెల 31, ఏప్రియల్ 1,న వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు ఏపీ మున్సిపల్ కమిష్ నర్ , డైరెక్టర్ మల్లికార్జున్ నాయక్ తెలిపారు.

14.31 న లాం లో కిసాన్ మేళా

శ్రీ వేంటేశ్వర పశు విశ్వ విద్యాలయం ఆధీనంలోనిలాం ( గుంటూరు) లో పసుగుణ పరిశోధన స్థానంలో  ఈ నెల 31 న కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు.

15.అమర్నాథ్ యాత్రకు ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ లు 

Telugu Amarnath Yatra, Corona India, Covid, Nagarjunasagar, Gold, Top-Latest New

హిమాలయాల్లోని అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి భక్తులు ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు భక్తులకు అమర్నాథుని దర్శనం లభించబోతోంది.

16.భారత్ లో కరోనా 

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 62,714 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.మరో వందేళ్లు భూమి సేఫ్ : నాసా

రాబోయే 100 ఏళ్ల వరకు ఆఫోఫిస్ అనే యాస్ట్రాయిడ్ తో భూమికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది.

18.ఢిల్లీలో రిజిస్ట్రేషన్ లేకుండా టీకా

Telugu Amarnath Yatra, Corona India, Covid, Nagarjunasagar, Gold, Top-Latest New

నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కరుణ వ్యాక్సినేషన కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్తగా మొదలయ్యింది.అర్హులైన వారందరికీ రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా టీకా అందిస్తామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు.

19.బంగ్లాదేశ్ కు 12 లక్షల కోవిడ్ వాక్సిన్ లు 

బంగ్లాదేశ్ కు 12 లక్షల కోవిడ్ వాక్సిన్ లు బహుమతి గా అందజేయనుంది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 41,910

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,720.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube