న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల పేరుతో మోసం

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను సప్లై చేస్తామంటూ కొంతమంది సైబర్ నేరానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.ఆక్సిజన్ కాన్సెంట్రేట్ అర్ల సరఫరా పేరుతో ఎంటర్ప్రైజెస్ యజమాని సిద్ధార్థను మోసం చేశారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.5లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందించబోతున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

3.మానుకోట ఉద్యమానికి పదకొండేళ్లు

మానుకోట రాళ్ల యుద్ధానికి నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా మానుకోట రాళ్లకు ఉద్యమకారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

4.మిస్డ్ కాల్ ఇస్తే ఉచితంగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ పోర్టియా మెడికల్ – కేవీయెన్ ఫౌండేషన్ లు సంయుక్తంగా మిషన్ హెచ్ o 2 పిఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.నగరంలో ఉచితంగా ఆక్సిజన్ ను అందించబోతున్నట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.ఆక్సిజన్ కావాల్సిన వారు 080- 68065385 కు మిస్డ్ కాల్ చేయాలని కోరారు.

5.ఇంటర్ ప్రవేశాలకు జూలై 7 వరకు గడువు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు జూలై 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

6.వృద్ధ కళాకారుల పెన్షన్ పెంపు

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

తెలంగాణలో వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 నుంచి రూ.3061 కి పెంచినట్లు జూన్ నుంచి దీన్ని అమలు చేయబోతున్న ట్లు తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

7.బాల్క సుమన్ కు పితృవియోగం

చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు పితృ వియోగం కలిగింది.బాల్క సుమన్ తండ్రి మెట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

8.పది పరీక్షలు వాయిదా

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా ప్రభావం తో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

9.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోంది.గురువారం స్వామి వారిని 10,601 మంది భక్తులు దర్శించుకున్నారు.

10.550 కోట్ల తో బందర్ మెడికల్ కళాశాల

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

550 కోట్లతో బందరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నామని, దీనికి ఈనెల 30వ తేదీన ఏపీ సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.

11.జూన్ 15 నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల

జూన్ 15 నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

12.64 ఆస్పత్రులపై ఫిర్యాదులు

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

తెలంగాణలో ప్రవేట్ ఆసుపత్రులలో ఫీజుల దోపిడీ పై ఆరోగ్యశాఖకు 64 ఆస్పత్రిలో పై 88 ఫిర్యాదులు అందాయి.

13.టీకా వందశాతం రక్షణ ఇవ్వదు

Covid 19 నుంచి వ్యాక్సిన్లు 100% రక్షణ కల్పించే లేవని నీతి అయోగ్ సభ్యుడు వి కె పాల్ తెలిపారు.

14.పరీక్షలు రద్దు పై సుప్రీం విచారణ వాయిదా

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

15.ఇంటర్ పరీక్షలకు రెండు ఛాన్స్ లు

తెలంగాణలో ఎంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులకు రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పరీక్షల్లో రెండుసార్లు నిర్వహించనుంది.

16.ఓటుకు నోటు కేసులో రేవంత్ కు ఊరట

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

17.కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి ఆగ్రహం

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు.

18.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,86,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.ప్రధానిని కలువనున్న మమత

Telugu Arvind Kejriwal, Corona, Godavari Delta, Nithi Ayog, Revanth Reddy, Gold,

ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు కలవనున్నారు.పశ్చిమ బెంగాల్ లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,700

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -49,860

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube