న్యూస్ రౌండప్ టాప్ 20 

1.అంబానీకి బెదిరింపు లేఖ

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియ దగ్గర పేలుడు పదార్థాలు ఉన్న కారులో అగంతకుడు రాసిన లేఖ పోలీసులకు దొరికింది.పేలుడు పదార్ధాలు ఉన్న కార మీ ఇంటికి సమీపంలో వదిలివేయడం కేవలం ట్రైలర్ మాత్రమే అని ఆ లేఖలో ఉంది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 26 February 2021 Today-TeluguStop.com

2.పెద్దపల్లి లో చిరుత సంచారం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

3.ఐదేళ్ల ఎల్.ఎల్.బి సీట్ల భర్తీకి 1న అడ్మిషన్స్

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బషీర్బాగ్ పీజీ లా కాలేజీలో 2020 21 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల కోర్సులో అడ్మిషన్ అవకాశం కల్పిస్తున్నారు.అర్హులైన విద్యార్థులు మార్చి 1న ఉదయం 10:30 గంటలకు జరిగే స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆ కాలేజీ ప్రిన్సిపల్ ప్రకటించారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 26 February 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ 20 -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.గవర్నర్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో సోమవారం కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.మంథని లో హైకోర్టు న్యాయవాదుల జంట వామన్ రావు, నాగమణి ల దారుణ హత్యలపై గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

5.పశువుల మంద పై రెండు పెద్ద పులుల దాడి

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

కొమురం భీం జిల్లాలో రెండు పెద్ద పులులు కలకలం సృష్టించాయి.జిల్లాలోని బెజ్జూర్ మండలం మానేపల్లి సమీపంలో పశువుల మంద పై ఒకేసారి రెండు పెద్ద పులులు దాడి చేశాయి.

6.బిజెపి జనసేన సమన్వయ కమిటీ భేటీ

బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో బీజేపీ జనసేన సమన్వయ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది.

7.ఏపీలో మూడు ప్రాంతీయ సదస్సులు : ఈసీ

ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల సన్నాహక మూడు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.27న తిరుపతిలో, 28న విజయవాడలో, వచ్చేనెల ఒకటో తేదీన విశాఖపట్నంలో వీటిని నిర్వహించనున్నారు.

8.ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ మావోల లేఖ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.ఈ మేరకు లేఖ విడుదల చేశారు.

9.రెండో రోజు చంద్రబాబు పర్యటన

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

జిల్లాలోని శాంతిపురం, రామ కుప్పం మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండో రోజు పర్యటన కొనసాగనుంది.

10.నేడు భారత్ బంద్దే

శంలో డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి నిరసనగా ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

11.నార్త్ సౌత్ భేదం రాహుల్ కు లేదు : వాద్రా

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

రాహుల్ గాంధీ ఎప్పుడు దేశాన్ని ఒకటిగా చూస్తారని , ఆయనకు నార్త్ – సౌత్ భేదం లేదని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు.

12.చెన్నై కు పారా మిలటరీ బలగాలు

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగానే పలు రాష్ట్రాల నుంచి పారామిలటరీ బలగాలను రాష్ట్రానికి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సత్య ప్రసాద్ సాహు ప్రకటించారు.

13.మార్చి 4 నుంచి ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష లు

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

మార్చి 4వ తేదీ నుంచి ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు.ఆర్టీసీలో కల్పించిన ఉద్యోగ భద్రత,  మార్గదర్శకాలు ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా లేవని , అందుకే ఈ నిరసన దీక్షకు దిగుతున్నట్లు ఆయన అన్నారు.

14.భారత్ బయోటెక్ తో బ్రెజిల్ ఒప్పందం

దేశీయ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తో బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.20 మిలియన్ డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం ఆ దేశ ఆరోగ్య శాఖ భారత్ కంపెనీతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది.

15.కుప్పం నేతలతో బాబు భేటీ

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన సందర్భంగా  నియోజకవర్గం లోని టిడిపి కీలక నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు.

16.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,577 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.కేసిఆర్ కు ఆర్.నారాయణ మూర్తి విజ్ఞప్తి

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.

18.తిరుమల శ్రీవారికి పోస్కో విరాళం

తిరుమల శ్రీవారి ఎస్ వి బి సి  ట్రస్టుకు పోస్కో సంస్థ 9 కోట్ల విరాళం ఇచ్చింది.

19.రామేశ్వరం ఆలయం లో కొత్త స్పటిక లింగం

Telugu #svbc, Ambani, Bharath Bioteck, Brezil, Chandrababu, Corona, Priyanka Gandhi, Rahul Gandhi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

రామేశ్వరం ఆలయంలో కొత్త స్పటిక లింగం భక్తులకు దర్శనం ఇస్తుంది.గతంలో ఉన్న స్పటిక లింగం ఈనెల 22వ తేదీన ఊహించని విధంగా దెబ్బతినడంతో, శృంగేరి మఠం కొత్త స్పటిక లింగాన్ని ఆలయానికి అందజేసింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,740

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,740.

#Brezil #Roundup #Chandrababu #Corona #Today Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు