న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.29 నుంచి సహజ సేంద్రియ ఉత్పత్తుల మేళా

ప్రకృతి సహజ పంటలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే లక్ష్యంతో రైతు నేస్తం మాసపత్రిక, రైతునేస్తం ఫౌండేషన్, కర్షక సేవా కేంద్రం సంయుక్తంగా రవీంద్రభారతిలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో సహజ సేంద్రియ ఉత్పత్తుల మేళా – 2021 నిర్వహించనుంది.

 Ap And Telangana News, Breaking Headlines, News Roundup, Top20news, Andhra Polit-TeluguStop.com

2.తెలంగాణలో కరోనా

Telugu Andhra, Jagan, Jagga, Shaermila, Gold, Top-Latest News English

తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది.గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.ఎమ్మెల్సీ వాణి దేవి కారుకు ప్రమాదం

అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ సురభి వాణి దేవి కారుకి ప్రమాదం జరిగింది.ఆమెను డ్రాప్ చేసిన అనంతరం ఎనిమిదవ నంబరు గేటును ఆ కారు ఢీకొంది.

4.ఎంజీ వర్సిటీని మూసివేత ఆపాలని విద్యార్థుల ధర్నా

కరోనా పేరుతో ఎంజి యూనివర్సిటీ మూసివేయడంతో యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగడంతో నార్కట్ పల్లి – అద్దంకి హైవేపై ట్రాఫిక్ స్తంభించింది.

5.325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Telugu Andhra, Jagan, Jagga, Shaermila, Gold, Top-Latest News English

స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ప్రారంభించారు.

6.నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం బీజేపీ కీలక సమావేశం కానుంది.అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీనియర్ నేతలతో భేటీ కాబోతున్నారు.

7.గవర్నర్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ

Telugu Andhra, Jagan, Jagga, Shaermila, Gold, Top-Latest News English

ఏపీ గవర్నర్శ్వ విభూషణ్ హరిచందన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం భేటీ అయ్యారు.దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది.

8.అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గారెడ్డి నిరసన

లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమార్తె జయా రెడ్డితో కలిసి నిరసన తెలియజేశారు.సంగారెడ్డి  నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు ,పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

9.రేపు భారత్ బంద్

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

10.42 వ రోజుకు చేరిన ‘ ఉక్కు ‘ దీక్షలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 42 వ రోజుకు చేరుకున్నాయి.

11.పంట పొలాలపై ఏనుగుల దాడులు

చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి పంటపొలాల్లో నూతన నివాసాలు లక్ష్యంగా ఏనుగులు దాడులు చేస్తూ పెద్ద వంశానికి పాల్పడుతుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు.యాదమరి పరిసర గ్రామాలైన కీనాటపల్లి, ధోని రేలపల్లి , పుల్లయ్య గారి పల్లి తదితర గ్రామాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది.

12.ముప్పై మూడు జిల్లాల ముఖ్యనేతలతో షర్మిల భేటీ

Telugu Andhra, Jagan, Jagga, Shaermila, Gold, Top-Latest News English

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైయస్ షర్మిల ఈరోజు తెలంగాణలోని 33 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు.

13.ఆగస్టు 23న లాసెట్

మూడు, ఐదేళ్ల ఎల్.ఎల్.బి, ఎల్ ఎల్ ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన క్లాస్ సెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది.అభ్యర్థులు మే 26 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చునని ఉన్నత విద్యా మండలి తెలిపింది.

14.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 53,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.చెన్నై కు రాహుల్

Telugu Andhra, Jagan, Jagga, Shaermila, Gold, Top-Latest News English

తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా సెక్యులర్ కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రాహుల్ ఈనెల 28వ తేదీన తమిళనాడుకు రానున్నారు.

16.అన్ని యూనివర్సిటీల పరీక్షలు వాయిదా

కరుణ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాల పరిధిలో జరగాల్సిన పరీక్షలు అన్నిటినీ వాయిదా వేస్తూ బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

17.నేటి నుంచి ఓయూ హాస్టల్స్ మూసివేత

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు మిగతా యూనివర్సిటీలకు కూడా అధికారులు సెలవులు ప్రకటించారు.ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లను గురువారం మధ్యాహ్నం నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

18.బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం

Telugu Andhra, Jagan, Jagga, Shaermila, Gold, Top-Latest News English

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021 ఆర్థిక బిల్లుకు లోక్ సభ లో మంగళవారం ఆమోదం లభించగా, బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది.

19.ఆలియా, సంజయ్ లకు కోర్టు సమన్లు

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ బన్సాలి, నటి అలియాభట్ కు మెట్రో పాలియన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది.‘ గంగుబాయ్ ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ ఆమె దత్తపుత్రుడు రాజీవ్ షా కోర్టులో దర్శకుడు, నటిపై పరువు నష్టం దావా వేసారు.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Andhra, Jagan, Jagga, Shaermila, Gold, Top-Latest News English

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు – 44,030

24.క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు -45,030.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube