న్యూస్ రౌండప్ టాప్ 20 

1.సినిమా థియేటర్లు మూసివేసి పై మంత్రి స్పందన

కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లు మూసివేస్తారు అని జరుగుతున్న ప్రచారంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.సినిమా థియేటర్ ల మూసివేత ఉండదని యధావిధిగా నడుస్తాయని మంత్రి ప్రకటించారు.

 Ap And Telangana News, Breaking Headlines, News Roundup, Top20news, Andhra Polit-TeluguStop.com

2.తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల చెరుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

3.నిజామాబాద్ లో మహిళా కిడ్నాపర్ల కలకలం

Telugu Andhra, Ap Telangana, Top-Latest News English

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మహిళ కిడ్నాపర్లు కలకలం సృష్టిస్తున్నారు.నగరంలోని వన్ టౌన్, త్రీటౌన్ పరిధిలో మాయ లేడీలు తిరుగుతున్నారని తెలుస్తోంది.ఓ మహిళ భిక్షాటన రూపంలో వచ్చి ఓ ఇంట్లోని చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.

3.వైయస్సార్ అనుచరుడు సూర్యుడిపై అల్లుడు దాడి

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులు సూర్యుడు మీద దాడి కలకలం రేపుతోంది సూర్యుడు అల్లుడు డాక్టర్ సురేంద్ర నాథ్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని సూరీడు నివాసంలో కి బలవంతంగా ప్రవేశించి క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

4.ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ ప్రోగ్రాం

ప్రొడక్ట్ డిజైన్ మేనేజ్మెంట్ లో ఎంటెక్ ప్రోగ్రామ్ ను ట్రిపుల్ ఐటి ప్రకటించింది.పనిచేసే నిపుణుల కోసం ఉత్పత్తి రూపకల్పనలో రెండు సంవత్సరాల మాస్టర్ ప్రోగ్రాం ప్రవేశపెడుతున్నామని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు.

5.భైంసా లో పర్యటించనున్న జాతీయ బీసీ కమిషన్

బీసీ కమిషన్ బుధవారం భైంసాలో పర్యటించనుంది.రిమాండ్ లో ఉన్న వారి వద్ద నుంచి వాంగ్మూలం తీసుకోనుంది.

6.ఏపీ సీఎస్ ను కలిసిన వైస్ అడ్మిరల్ బహదూర్ సింగ్

సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ను తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజెంద్ర బహదూర్ సింగ్ ఈరోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

7.గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు

Telugu Andhra, Ap Telangana, Top-Latest News English

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

8.సీఎం జగన్ తో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భేటీ

ఏపీ సీఎం జగన్ తో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భేటీ అయ్యారు.కోవిడ్ వ్యాక్సినేషన్ ప్లాన్ పై చర్చించారు.కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం కేకల పంపిణీ వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ సూచించారు.

9.ఏపీ లో ఎస్సీ ఎస్టీ స్టేట్ లెవెల్ హైపవర్ కమిటీ భేటీ

ఎస్సీ ఎస్టీ స్టేట్ లెవెల్ హైపర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది హోంమంత్రి సుచరిత మంత్రులు ఆదిమూలపు సురేష్ , విశ్వరూప్ , తానేటి వనిత డిజేపీ గౌతమ్ సవాంగ్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

10.పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వలేం : నిమ్మగడ్డ

ప్రస్తుత పరిస్థితులు ఏపీలో పరిషత్ ఎన్నికలు నిర్వహించలేము అని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

11.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు పనబాక లక్ష్మి నామినేషన్

Telugu Andhra, Ap Telangana, Top-Latest News English

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేశారు.

12.దుర్గగుడి పాలకమండలి సమావేశం ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది చైర్మన్ సోమి నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో సురేష్ బాబు , పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

13.పర్యాటక మంత్రిని కలిసిన టిఆర్ఎస్ నాయకులు

వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, బండ ప్రకాష్, మాలోత్ కవిత తో కలిసి వినతిపత్రం అందజేశారు.

14.21 నుంచి ఓపెన్ స్కూల్స పరీక్షలు

ఆంధ్ర ప్దేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం విడుదల చేశారు.జూన్ 21 నుంచి 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

15.మే 15 నుంచి వేసవి సెలవులు

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉంటాయి అని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.

16.కర్నూలులో సీఎం జగన్ పర్యటన

Telugu Andhra, Ap Telangana, Top-Latest News English

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

17.నేటి నుంచి తిరుపతి ఉప ఎన్నికక నామినేషన్ల స్వీకరణ

తిరుపతి ఉప ఎన్నికకు కలెక్టరేట్ లో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది.

18.ఆధార్ పాన్ అనుసంధానం చేయకపోతే జరిమానా తప్పదు

ఆధార్ పాన్ అనుసంధానికి చివరి తేదీ ఈ నెల 31.ఆ గడువు లోగా వీటిని అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని , అంతేకాకుండా వెయ్యి రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, లోక్ సభలో మంగళవారం ఆమోదించిన ఆర్థిక బిల్లు 2021లో ఈ నిబంధనలు విధించింది.

19.పాక్ ప్రధాని ఇమ్రాన్ కు మోదీ లేఖ

Telugu Andhra, Ap Telangana, Top-Latest News English

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశారు.పొరుగునే ఉన్న పాక్ తో తాము మంచి స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,020

24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర – 45,020.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube