న్యూస్ రౌండప్ టాప్ -20 

1.కేంద్రంపై కేటీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

 Ap And Telangana News, Breaking Headlines, News Roundup, Top20news, Andhra Polit-TeluguStop.com

2.ఏపీకి ప్రత్యేక హోదా కుదరదు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈ సమాధానం చెప్పారు.

3.రాత్రిపూట కర్ఫ్యూ ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం

Telugu Andhra, Ap Telangana, Corona India, Revanthreddy, Top-Latest News - Telug

తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ కానీ, లాక్ డౌన్ కానీ విధించే ఆలోచనలో కేంద్రం ఉంది.

4.కర్నూలు జిల్లాలో ఈడీ సోదాలు

కర్నూలు జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికార్లు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.ఎమ్మిగనూరు, నంద్యాలలో పలు చోట్ల ఈ సోదాలు నిర్వహించారు.

5.నాడు – నేడు మంచి అనుభూతి ఇస్తోంది : డీజీపీ గౌతమ్ సవాంగ్

ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం మంచి అనుభూతిని ఇస్తోందని , నాడు నేడు కార్యక్రమం ద్వారా పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడం సంతోషకరమని సవాంగ్ అన్నారు.

6.రేవంత్ రెడ్డికి కరోనా

Telugu Andhra, Ap Telangana, Corona India, Revanthreddy, Top-Latest News - Telug

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా ప్రభావం కు గురయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా రేవంత్రడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

7.తెలంగాణ మొత్తం సాగునీరు అందిస్తాం

తెలంగాణలోని నీటి కొరత లేకుండా రాష్ట్రమంతటా సాగునీరు అందిస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

8.కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం

కామారెడ్డి జిల్లా లోని భిక్కనూరు మండలం గుర్జుకుంట గ్రామ సమీపంలో చిరుతపులి సంచరించడం కలకలం రేపుతోంది.తాజాగా ఈ గ్రామంలో ఓ కారుకు ఈ చిరుత అడ్డు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

9.టన్ను చేపలు మృతి

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారు లోని రాయి కుంట లో ఒక టన్ను చేపలు ఆకస్మికంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.

10.మొసలి దాడిలో రైతు మృతి

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజి పేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45) అనే వ్యక్తి మంజీరా నదిలకి దిగి గేదెలు కడుతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసి చంపేసింది.

11.మంత్రులు బొత్స పెద్దిరెడ్డి లకు హైకోర్టు నోటీసులు

Telugu Andhra, Ap Telangana, Corona India, Revanthreddy, Top-Latest News - Telug

ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.గవర్నర్ తో తన ఉత్తర ప్రత్యుత్తరాలు లీకేజ్ పై విచారణ జరపాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

12.రక్షణ దళాలకు మహేంద్ర వాహనాలు

భారత రక్షణ దళాలు దేశీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ మహేంద్ర డిఫెన్స్ సిస్టం లిమిటెడ్ వాహనాలను సరఫరా చేయనుంది.

13.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.ఆస్ట్రేలియాను వణికిస్తున్న వరదలు

ఆస్ట్రేలియా తూర్పు తీర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

15.తంజావూరులో 7 కోట్లు స్వాధీనం

తంజావూరులో మూడు గంటల వ్యవధిలో తగిన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఏడు కోట్ల రూపాయల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

16.బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Telugu Andhra, Ap Telangana, Corona India, Revanthreddy, Top-Latest News - Telug

పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది ప్రధాని నరేంద్రమోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు.

17.ఫ్లిప్ కార్డ్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఆఫర్లు

Telugu Andhra, Ap Telangana, Corona India, Revanthreddy, Top-Latest News - Telug

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ శుభ వార్త చెప్పింది.బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ పేరుతో ఫ్లిప్కార్ట్ మరో కొత్త సేల్ ను తీసుకొచ్చింది.

18.ఓకే కార్పొరేషన్ గా తాడేపల్లి , మంగళగిరి

తాడేపల్లి ,మంగళగిరి మున్సిపాలిటీ లను ఒకే కార్పొరేషన్ గా మారుస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

19.  భారత్ లో కరోనా

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,715 మందికి కరోనా పాజిటివ్ సోకింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Andhra, Ap Telangana, Corona India, Revanthreddy, Top-Latest News - Telug

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,000

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -44000

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube