న్యూస్ రౌండప్ టాప్ 20

1.కుక్కలు పిల్లులకూ కరోనా

జంతు ప్రదర్శన శాలలోని పులులు సింహాలు చిరుతలు తో పాటు పెంపుడు జంతువైన పిల్లులు కుక్కలు కుందేళ్ళ కూడా కరోనా సోకే అవకాశం ఉందని హైదరాబాదులోని లేబరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేజర్డ్ స్పేసిస్ ( లాకోన్స్ ) సంస్థ వెల్లడించింది.అయితే ఆ జంతువుల నుంచి వైరస్ మనుషులకు సోకే ప్రమాదం లేదని స్పష్టం చేసింది.
 

2.ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం

  వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
 

3.ఎఫ్ బి ఓ పరీక్ష ఫలితాలు విడుదల

  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను టిఎస్పిఎస్సి విడుదల చేసింది.
 

4.103 ఏళ్ళ వృద్ధుడు కి టీకా

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

  103 సంవత్సరాలు వయసున్న నిజాం పేట్ కు చెందిన కోరాడ రామచంద్ర మూర్తి అనే వ్యక్తి కోవిడ్ తొలి డోస్ తీసుకున్నారు.దీంతో ఆయన పేరును కోవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్న శతాధిక వృద్ధుల జాబితాలో చేర్చారు.
 

5.‘ముక్కు ‘ టీకా  మొదటిదశ పరీక్షలు పూర్తి

  ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వాక్సిన్ పై భారత్ బయోటెక్ మొదటి దశ ప్రయోగ పరీక్షలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
 

6.మూడు రోజులు తేలికపాటి వర్షాలు

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

  తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు .
 

7.నేటి నుంచి తెలంగాణలో సీరో సర్వే

  దేశంలో ఎంత మంది ప్రజలు కరోనా బారిన పడ్డారని అంశాన్ని నిర్ధారించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి చేపట్టిన అధ్యయనంలో భాగంగా తెలంగాణలో మంగళవారం నుంచి నాలుగో విడత సీరో సర్వే జరగనుంది.
 

8.‘ ధరణి ‘ పై ఆదేశాలు సెప్టెంబర్ 8 దాకా పొడగింపు

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

  ధరణి వెబ్ పోర్టల్ పై దాఖలైన వ్యాఖ్యల్లో గతంలో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను హైకోర్టు సెప్టెంబర్ 8 వరకు పొడిగించింది.
 

9.లాక్ డౌన్ లో సీజ్ అయిన వాహనాల విడుదలకు రంగం సిద్ధం

  లాక్ డౌన్ లో సీజన్ వాహనాలు విడుదలకు రంగం సిద్ధమైంది.సీజ్ అయిన వాహనాలు తీసుకెళ్లవచ్చు అని తెలంగాణ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
 

10.వైయస్ వివేకా హత్య కేసు

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి 16వ రోజు సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు.
 

11.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.సోమవారం 15,973 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
 

12.  తెలంగాణ ఎంసెట్ తేదీలు

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

  ఆగస్టు 4 10 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను  నిర్వహించనున్నారు.
 

13.ఏపీలో కరోనా

  గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 2620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

14.ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

  కర్ణాటకలోని కృష్ణగిరి జిల్లా డెంకనీ కోట తాలూకా సమీపంలోని ఉబిండా ఏనుగు దాడిలో కుంటప్ప (63) అనే వ్యక్తి మృతి చెందాడు.
 

15.భారత్ లో కరోనా

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

16.శశికళ అనుచరుడి కారు దహనం

  ఇటీవల అన్నాడీఎంకే నుండి డిస్మిస్ అయిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ అనుచరుడు విన్సెంట్ రాజాకు చెందిన లగ్జరీ కారును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగులబెట్టారు.ఈ ఘటన రామనాథపురం జిల్లా పరమక్కుడి సమీపంలోని మేల్ కావనూరు లో జరిగింది.
 

17.జగన్ కు రఘురామ మరో లేఖ

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

  వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ కు వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు.ఏపీలో జగనన్న క్యాంటీన్ కు తెరవాలి అంటూ ఆయన లేఖలో కోరారు.
 

18.జగన్ ప్రభుత్వం పై చిరంజీవి ప్రశంసలు

  ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం పై మెగాస్టార్ చిరంజీవి జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.
 

19.అనకాపల్లి బెల్లం పొడి కి పేటెంట్

Telugu Cm Jagan, Jayalalitha, Chirenjeevi, Telangana, Gold, Top-Latest News Engl

   ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కి చెందిన అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం అరుదైన ఘనత సాధించింది.బెల్లం అనుబంధ ఉత్పత్తుల తయారీలో విశేష కృషికి పేటెంట్ దక్కింది.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,220   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,220. 

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube