న్యూస్ రౌండప్ టాప్ 20 

 

1.నిర్మాతగా మారిన తాప్సి

  టాలీవుడ్ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించిన యంగ్ హీరోయిన్ తాప్సీ ఇప్పుడు నిర్మాతగా మారింది.అవుట్ సైడర్ ఫిలిమ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
 

2.వైమానిక స్థావరం పై మరోసారి డ్రోన్

  చము సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ తిరిగినట్లుగా అధికారులు తెలిపారు.వైమానిక స్థావరానికి చెందిన స్థావరం పై డ్రోన్లతో దాడులు జరిపిన సంగతి తెలిసిందే.అదే ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినట్లు అధికారులు తెలిపారు.
 

3.కొనసాగుతున్న బజరంగ్దళ్ కార్యకర్తల అరెస్ట్ లు

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  ప్రగతి భవన్ వద్ద బజరంగ్దళ్ కార్యకర్తలు అరెస్ట్ లు ఇంకా కొనసాగుతున్నాయి.బజరంగ్దళ్ కార్యకర్తలు విడతలవారీగా వచ్చి ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నిస్తుండటంతో వందలాది మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
 

4.అంబేద్కర్ వర్సిటీలో 5 వరకు ఎంబీఏ ప్రవేశాలు

  బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేయాలనుకుంటున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది.మరిన్ని వివరాల కోసం 040 -23680441 / 241/243 నంబర్ కు ఫోన్ చేయవచ్చు.
 

5.త్వరలో ఎక్సైజ్ ఉద్యోగాల భర్తీ

  ఎక్సైజ్ శాఖ లోని ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
 

6.హోం మంత్రి ఇంటి ముట్టడి కి అగ్రిగోల్డ్ బాధితుల యత్నం

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ హోంమంత్రి సుచరిత ఇంటి వద్దకు వెళ్లేందుకు అగ్రిగోల్డ్ బాధితులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 

7.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జగన్ కు రఘు రామ లేఖ

  ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.
 

8.గీతం ఆర్ సెట్ ఫలితాలు విడుదల

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాలు పరిశోధన ప్రవేశాల నిమిత్తం గత నెల 15వ తేదీన నిర్వహించిన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను ఆ విభాగం డైరెక్టర్ డాక్టర్ రాజా ఫణి విడుదల చేశారు.
 

9.ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్ గా వేణుగోపాల్

  ధ్రువ వర్సిటీ ఆంగ్ల శాఖలో పనిచేస్తున్న ఆచార్య రాజేంద్రప్రసాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు.
 

10.గన్నవరం ఎయిర్ పోర్టులో నూతన రన్ వే ప్రారంభం

  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో నేడు నూతన రన్ వే ప్రారంభమైంది .7,500 అడుగులుగా ఉన్న విస్తీర్ణాన్ని 11,023 కి పెంచారు.
 

11.వారణాసిలో నేడు ప్రధాని పర్యటన

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  వారణాసి లు నేడు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
 

12.వక్ఫ్ ఆస్తుల జియో మ్యాపింగ్

  వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అధునాతన సాంకేతిక పద్ధతిలో జియో మ్యాపింగ్ చేస్తున్నట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ సంక్షేమ మంత్రి అంజద్ భాషా తెలిపారు.
 

13.యూత్ కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  పెరిగిన పెట్రోల్ గ్యాస్ ధరల కు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
 

14.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

15.కవిత పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ చేద్దాం అనుకున్నారని,  కవిత ఎమ్మెల్యేగా గెలిస్తే కేటీఆర్ కు పోటీ వస్తుందని, సీఎం పదవికి కవిత కాంపిటీషన్ వచ్చేదని ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

16.20 నుంచి చెన్నై సూరత్ విమాన సేవలు

  చెన్నై నుంచి గుజరాత్ రాష్ట్రం సూరత్ కు విమాన సేవలు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
 

17.హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు ప్రమాణస్వీకారం చేశారు.
 

18.దేశద్రోహం చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

  దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా తరుణంలో బ్రిటిష్ చెందిన, వలస తెచ్చుకున్న చట్టం అవసరమా అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది.దేశద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కోర్టు ఈ విధంగా స్పందించింది.
 

19.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Aravind, Jagan, Anjad Bhasha, Mp Kavitha, Raghurama, Suchar

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.నిన్న శ్రీవారిని 16,787 మంది భక్తులు దర్శించుకున్నారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,090   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,090. 

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube