న్యూస్ రౌండర్ టాప్ 20

1.వీహెచ్ కు ఉపరాష్ట్రపతి ఫోన్

ఎంపీ మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ లో పరామర్శించి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు.
 

2.మహేశ్వరం లో గవర్నర్ పర్యటన

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈరోజు మహేశ్వరం లో పర్యటించనున్నారు.
 

3.విజయవాడ లో కాంగ్రెస్ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు

  విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సైకిల్ ర్యాలీని అజిత్ సింగ్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు.పెరిగిన నిత్యావసర వస్తువులు పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ విజయవాడ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
 

4.తాడిపత్రిలో షర్మిల నిరాహారదీక్ష

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల దీనిలో భాగంగా రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేయనున్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామం లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
 

5.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 18,010 మంది భక్తులు దర్శించుకున్నారు.
 

6.శ్రీశైలంలో ఆర్జిత సేవలు ప్రారంభం

  ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి.
 

7.16 నుంచి సత్యసాయి మహాసమాధిని దర్శనం

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ద్వారాలు  ఈ నెల 16 నుంచి తెరుచుకోనున్నాయి.ఆ రోజు నుంచి సత్యసాయి మహా సమాధి దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని ఆదివారం ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి.
 

8.ఏపీ నిట్ లో పెరిగిన సీట్లు

  ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఏపీ నిట్ ) లో ఈ ఏడాది నుంచి సీట్ల సంఖ్య పెరిగింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాలో పది శాతం సీట్లు భర్తీ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.ఫలితంగా ఏపీ నిట్ లి లో బీటెక్ లో 750 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.
 

9.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 37,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

10.కేరళలో జిక వైరస్

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  కేరళ రాష్ట్రంలో ఒక వైరస్ కలకలం సృష్టిస్తోంది.తాజాగా మరో మూడు వైరస్ కేసులు వెలుగు చూశాయి.దీంతో కేరళలో మొత్తం కేసులు సంఖ్య 18 కి పెరిగింది.
 

11.ఐబీపీఎస్ నోటిఫికేషన్

  ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( ఐబీబీఎస్ ) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  12.కోవిడ్ నివారణ చర్యలపై జగన్ సమీక్ష

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సోమవారం తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 

13.‘ రామారావు ఆన్ డ్యూటీ ‘ పోస్టర్ రిలీజ్

  మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రానికి రామారావు అనే టైటిల్ ను ఖరారు చేసారు.దీనికి ఆన్ డ్యూటీ అనే క్యాప్షన్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
 

14.దాసరి బయోపిక్

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

దిగ్గజ చిత్ర నిర్మాత దాసరి నారాయణరావు జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించనున్నారు .ఈ చిత్రానికి సీనియర్ చిత్రనిర్మాత ధవళ సత్యం దర్శకత్వం వహించనున్నారు.
 

15.టిఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ

  తెలంగాణ టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ టిఆర్ఎస్ లో చేరారు.వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు.
 

16.అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ ఆంక్షలు

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  ఏపీ లోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పది నుంచి ఉదయం 6 గంటల వరకు ఇది అమలు కానుంది.
 

17.ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ విచారణ

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 

18.రాజకీయాల్లోకి రావట్లేదు : రజనీ కాంత్

Telugu Jagan, Ramana, Gold, Top, Zika-Latest News - Telugu

  తాను రాజకీయాల్లోకి రావడం లేదని అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ మరోసారి స్పష్టం చేశారు.
 

19.నేడు పూరి రథయాత్ర

  ఒడిషాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు.ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే భక్తులు లేకుండానే శ్రీ క్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ వేడుక చేపట్టనున్నారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,810   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,810

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube