న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై హైకోర్టులో విచారణ

  అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ నేడు జరిగింది.అగ్రి గోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువగా ఆంధ్ర లో ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టు ఏపీ విభజన చట్టం ప్రకారం బదిలీ చేసే విషయాన్ని న్యాయస్థానం పరిశీలిస్తోంది.
 
2.షర్మిల వద్ద రైతుల ఆవేదన

  వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న వైయస్ షర్మిలకు ఆ జిల్లాలోని దోమ మండలం ఆరేపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను షర్మిల వద్ద చెప్పుకుని ఆవేదన చెందారు.
 
3.ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై క్లారిటీ

  మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రేపు ఉదయం 11గంటలకు రాజీనామా చేయనున్నారు.ఈ నెల 14న ఆయన బిజెపిలో చేరుతారని రాజేందర్ సన్నిహితులు తెలిపారు.
 
4.ఎంపీ నామ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహించారు.
 
5.ఆగస్ట్ మొదటివారంలో ఎంసెట్

  ఆగస్టు మొదటి వారంలో తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
6.16 నుంచి పది ఇంటర్ ఆన్లైన్ పాఠాలు

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  పదో తరగతితో పాటు ఎంటర్ ఆన్లైన్ పాఠాలను ఈ నెల 16 నుంచి ప్రారంభించాలని తెలంగాణ విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది.
 
7.షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

  వికారాబాద్ జిల్లా చింతపల్లి మండలం వైఎస్ఆర్ టిపీ అధ్యక్షురాలు షర్మిల ఆన్లైన్ పోలీసులు నిలిపివేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 11 June 2021 Today-TeluguStop.com

కువైట్ కారణంగా షర్మిల కాన్వాయ్ లో రెండు వాహనాలకే అనుమతి లభించింది.దీంతో కాసేపు పోలీసులు వైఎస్ఆర్ టిపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
 
8.జూలై లోగా డిగ్రీ ప్రవేశాలు పూర్తి

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఫలితాల ప్రకటనలో స్పష్టత రావడంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి డిగ్రీ ప్రవేశాల పై దృష్టి సారించింది.జూలై లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టులో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.
 
9.నేడు హైదరాబాద్ కు జస్టిస్ ఎన్వి రమణ

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వి రమణ ఈరోజు హైదరాబాద్ రానున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్.వి.రమణ మంత్రి కేటీఆర్ స్వాగతం పలకనున్నారు.
 
10.పాస్ పోర్ట్ ఆన్లైన్ స్లాట్లు ప్రారంభం

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  కొత్త పాస్పోర్ట్ దరఖాస్తులు, రెన్యువల్ కోసం ప్రజలు ఆన్లైన్ లో స్లాట్ లు బుక్ చేసుకోవాలని తెలంగాణ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
 
11.ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్

  ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది.కేంద్ర బిజెపి పెద్దలను జగన్ ఈ టూర్ లో కలుసుకున్నారు జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాన్ని భరత్ తదితరులు ఉన్నారు.
 
12.విజయవాడలో కాంగ్రెస్ నేతల ఆందోళన

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్ నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు.ఏపీ సి సి ఉపాధ్యక్షుడు మస్తాన్వలి ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు రాజు వ్రతం తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
13.ఐదో రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 5వ రోజూ కొనసాగుతోంది.కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సిబిఐ విచారణ కొనసాగుతోంది.
 
14.మోడీని కలిసిన యోగి ఆదిత్యనాథ్

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
 
15.శరద్ పవార్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ

  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశర్ శుక్రవారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు.
 
16.ఢిల్లీలో వాహనాలకు వేగ పరిమితి విధింపు

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాహనాల బేగం పై నియంత్రణ విధించారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వేగ పరిమితి విధించారు.
 
17.జూలో మరో సింహానికి అస్వస్థత

  తమిళనాడులోని వండలూరు లో ఉన్న అన్న జంతు ప్రదర్శన శాలలో సింహాలకు కరోనా వైరస్ సోకింది .వీటిలో తొమ్మిదేళ్ల ఆడ సింహం మరణించింది ఈ క్రమంలోనే మరో సింహం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
 
18.కర్ణాటక లో పాక్ మహిళ అరెస్ట్

Telugu Agri Gold Company, Breaking News, King Narasimha Rao, Prashant Kishore, Roundup, Today Gold Rate, Top20 News, Vivekananda Reddy, Yogi Adityanath-Latest News English

  మూడు నెలల పర్యాటక విసా పై భారత దేశానికి వచ్చిన పాక్ మహిళ అక్రమంగా కర్ణాటకలో నివాసం ఉండడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
 
19.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 91,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,760   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48, 760

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 11 June 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ – 20 -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Today Gold Rate #Roundup #Yogi Adityanath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు