న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

1.బాసర ట్రిపుల్ ఐటి అసిస్టెంట్ రిజిస్టర్ పై వేధింపుల కేసు

Telugu Gurumurthy, Hareesh Rao, Kavitha, Nomula Simhaiya, Surabhi Vani, Gold, To

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ లో రిజిస్టర్ రంజిత్ పై కేసు నమోదైంది.ఆయన భార్య సింధు పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు పెట్టారు.

2.కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనా ఉద్యమానికి మావోయిస్టులు మద్దతు

వరంగల్ జిల్లా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమానికి మావోయిస్టు పార్టీ విప్లవ కార్మిక సమాఖ్య సంపూర్ణ మద్దతు ప్రకటించింది.కోచ్ ఫ్యాక్టరీ సాధనకోసం ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించదలిచిన నిరసన దీక్షకు మద్దతు ప్రకటించింది.

3.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

4.రేపటితో సాగర్ ఉప ఎన్నికలకు నామినేషన్ ల ముగింపు

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది.

5.యాదాద్రి దేవాలయం లో 68 మంది ఉద్యోగులకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో కరోనా కలకలం రేపుతోంది దేవాలయంలో పనిచేస్తున్న 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

6.నీట్ పీజీ ఫీజు కట్టని వారికి 30 వరకూ ఛాన్స్

పోస్ట్ గ్రాడ్యుయేట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కు 1,74,886 దరఖాస్తులు వచ్చాయని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపింది.అయితే వారిలో 1,063 మంది అభ్యర్థులు ఫీజు కట్టలేదని పేర్కొంది వారికోసం మార్చి 30 మధ్యాహ్నం మూడు గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

7.వచ్చే నెల 3న కవి సమ్మేళనాలు

75 వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వచ్చేనెల 3న కవిసమ్మేళనాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

8.‘మన బాలు కథ ‘ పుస్తకం ఆవిష్కరణ

Telugu Gurumurthy, Hareesh Rao, Kavitha, Nomula Simhaiya, Surabhi Vani, Gold, To

గాన గంధర్వుడు, పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం జీవిత విశేషాలతో ‘ మన బాలు కథ ‘ అని పుస్తకం ఆవిష్కృతం అయింది.ఈ పుస్తకాన్ని బి ఎస్ జగదీష్ అనే వ్యక్తి రచించారు.దీనిని ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఆవిష్కరించారు.

9.పార్టీ పెట్టను సాగర్ లో పోటీ చేయను

‘కొత్తగా పార్టీ పెట్టాను, నాగార్జునసగర్ లో పోటీ చేయను ‘అని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

10.మల్లన్నకు 60,000 బోనాలు

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దపూర్ లో బోనాల జాతర వైభవంగా జరిగింది దాదాపు 60 వేల బోనాలను భక్తులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

11.ఎమ్మెల్యే రోజాకు రెండు ఆపరేషన్లు విజయవంతం

Telugu Gurumurthy, Hareesh Rao, Kavitha, Nomula Simhaiya, Surabhi Vani, Gold, To

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ అఫరేషన్ లు విజయవంతం అయినట్లు రోజా భర్త సెల్వమణి తెలిపారు.

12.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్

తిరుపతిలో సభ ఉప ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు.

13.కోవిడ్ వేయించుకున్న కవిత

Telugu Gurumurthy, Hareesh Rao, Kavitha, Nomula Simhaiya, Surabhi Vani, Gold, To

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

14.పౌరులపై కాల్పులు .అమెరికా ఆగ్రహం

మయన్మార్ లో సైనికులు కాల్పులలో పౌరులను బలితీసుకోవడం పై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ మేరకు అధ్యక్షుడు బైడన్ మండిపడ్డారు.

15.వీల్ చైర్ లో మమత రోడ్ షో

Telugu Gurumurthy, Hareesh Rao, Kavitha, Nomula Simhaiya, Surabhi Vani, Gold, To

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగనున్నాయి.నందిగ్రామ్ నియోజకవర్గంలో తాజాగా విన్ మమతా బెనర్జీ రోడ్ షో నిర్వహించారు.

16.ఆరు కోట్లతో ప్రభాస్ కారు కొనుగోలు

టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ 6 కోట్లతో కొత్త ఫారిన్ కారు కొనుగోలు చేశారు.

17.సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా భరత్

Telugu Gurumurthy, Hareesh Rao, Kavitha, Nomula Simhaiya, Surabhi Vani, Gold, To

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నరసింహయ్య కుమారుడు భగత్ కు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.

18.నిరు పేదలకు శుభవార్త : హరీష్ రావు

నిరుపేదలకు త్వరలోనే సీఎం కేసీఆర్ శుభ వార్త  ప్రకటించనున్నారు అని, సొంత ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

19.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభీ వాణికి కరోనా

Telugu Gurumurthy, Hareesh Rao, Kavitha, Nomula Simhaiya, Surabhi Vani, Gold, To

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభీ వాణీ దేవి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 42,980

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,980.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube