న్యూస్ రౌండ్ టాప్ 20

న్యూస్ రౌండ్ టాప్ 20

1.ఏపీ హైకోర్టు తరలింపు పై కేంద్రం స్పందన

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

రాజ్యసభలో ఏపీ హైకోర్టు తరలింపు పై జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.హైకోర్టు తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రతిపాదనలు పంపారని తెలిపారు.ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని ఆయన ప్రకటించారు.

 Andhra Pradesh And Telangana Breaking News, Ap High Court Orders.,andhra Pradesh-TeluguStop.com

2.సాగు చట్టాలపై భారత్ కు అమెరికా మద్దతు

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్ చేపట్టిన చర్యలకు అమెరికా మద్దతు తెలిపింది.

3.రాజ్యసభ ముందుకు జమ్మూ కాశ్మీర్ బిల్లు

జమ్మూకాశ్మీర్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది.ఈ మేరకు సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

4.భారత్ లో కరోనా

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,899 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.శ్రీవారి సేవలో నిమ్మగడ్డ రమేష్

తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు.ఈరోజు విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

7.అరుణ యాప్ లను బ్లాక్ చేయమన్న హైకోర్ట్

రుణ యాప్లను బ్లాక్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశించింది.రుణ యాప్లను తొలగించేందుకు వెంటనే ప్లే స్టోర్ లను సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది.

8.మార్చి 13 నుంచి యూజీ పరీక్షలు

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

బిఆర్ అంబేద్కర్ దూరవిద్య డిగ్రీ ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు మార్చి 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

9.తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనుమానాలు

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది.ఇప్పటికే అనేక రాష్ట్రాలు పక్షులు, కోళ్లు మరణిస్తున్నాయి.దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ గా నిర్ధారించినట్లు కేంద్రం చెబుతోంది.

తాజాగా తెలంగాణలోనూ ఇదేవిధంగా కాకులు, వలస పక్షులు, కోళ్లు పెద్దఎత్తున మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ గా అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

10.అమిత్ షా ను కలిసిన టిడిపి ఎంపీలు

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేసినేని నాని కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి ఏపీ ప్రభుత్వం పై వివిధ అంశాలపై ఫిర్యాదు చేశారు.

11.గుండెపోటుతో టిఆర్ఎస్ యువ నేత మృతి

టిఆర్ఎస్ లింగోజిగూడ డివిజన్ యువ నాయకుడు, జిహెచ్ఎంసి ఏరియా సభ్యుడు కొనమళ్ల కుమార్ గుండెపోటుతో మరణించారు.

12.జివిఎంసి ఎన్నికలపై వైసీపీ కసరత్తు

జివిఎంసి ఎన్నికలపై వైసిపి కసరత్తు మొదలు పెట్టింది.గురువారం వైసీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తో కలిసి నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టారు.

13.2019 ఓటర్ల జాబితానే ఫైనల్

ఏపీ పంచాయతీ ఎన్నికలకు 2019 జనవరి 1 నాటికి ఓటర్ల జాబితా ఫైనల్ అంటూ ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.2019 ఓటర్ల జాబితా అంశంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.

14.ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు పై కేసు

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

విశాఖ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు అతని అనుచరుడు డిఎస్ఎం రాజు పై రాంబిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

15.ఈ వాచ్ యాప్ పై హై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

ఏపీలో పంచాయతీ ఎన్నికలు సవ్యంగా జరిపించడానికి ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న ఈ వాచ్ యాప్ ను విడుదల చేసారు.దీనిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.

16.6 న ఖమ్మం కు ఠాకూర్

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

ఈనెల ఆరో తేదీన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్ తెలంగాణకు రానున్నారు.ఖమ్మంలో నిర్వహించనున్న కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటారు.

17.జూబ్లీహిల్స్ కార్పొరేటర్ ఎన్నిక చెల్లదంటూ ఫిర్యాదు

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

ఫోర్జరీ పత్రాలు తప్పుడు అఫిడవిట్ తో జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన డేరంగుల వెంకటేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ టిఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

18.ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాబోతోంది.ప్లాంట్ లో 100 శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

19.100 రుణ యాప్ లపై నిషేధం

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

ప్రజలను ఇబ్బంది పెడుతున్న రుణ యాప్స్ పై గూగుల్ చర్యలకు దిగింది.దాదాపు 100 యాప్లో పై నిషేధం విధించింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Andhra Pradesh, Ap, Covid, Kannababu Raju, Kannababu-Latest News English

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,960

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,960.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube