న్యూస్ రౌండప్ టాప్ 20

1.జితేందర్ రెడ్డి పీఏ కు తెలంగాణ పోలీసుల నోటీసులు

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్రను పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే అయితే ఈ వ్యవహారంలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి పిఎ జితేందర్ రాజ్ కు తెలంగాణ పోలీసులు నోటీసు జారీ చేశారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.టీటీడీ కీలక ప్రకటన

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

తిరుమలలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న హోటళ్లు రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయని తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.

4.ఏప్రిల్ 26న యాదాద్రి లో శివాలయం ప్రారంభం

తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వత వర్దిని సైత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 25న ప్రారంభించనున్నారు.

5.మెట్రో రైల్లో ప్రయాణించిన బండి సంజయ్

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి మెట్రో రైల్లో ప్రయాణించారు.గాంధీభవన్ మెట్రో నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.

6.బ్యారేజ్ ని పరిశీలించిన కడియం

దేవాదుల ప్రాజెక్టు లో భాగమైన సమ్మక్క బ్యారేజ్ ని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సందర్శించారు.

7.టిఆర్ఎస్ పై భట్టి విక్రమార్క ఆగ్రహం

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

7.ముగిసిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం

తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గైర్హాజరయ్యారు.

8.షర్మిల కామెంట్స్

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

9.మహిళల భద్రత లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

మహిళల భద్రత లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని , మహిళల భద్రతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

10.హైదరాబాద్ కు మహేంద్ర మెడికల్ కాలేజీ

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

తెలంగాణలో కొత్తగా మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది.ఈ మేరకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

11.యాదాద్రి లో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి

12.వారితో నేడు రేవంత్ రెడ్డి సమావేశం

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

కాంగ్రెస్ డిజిటల్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ లతో నేడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.

13.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది .గురువారం తిరుమల శ్రీవారిని 50,511 మంది భక్తులు దర్శించుకున్నారు.

14.ఉప రాష్ట్రపతి రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ కు నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్నారు.ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

15.సినీ నటుడు శివాజీ కామెంట్స్

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని సినీ నటుడు శివాజీ అన్నారు.తాజాగా తొమ్మిది మంది వైసీపీ ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ తో టచ్ లో ఉన్నారని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

16.హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలి : జేడీ శీలం

ఏపీ రాజధాని పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని ,కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం అన్నారు.హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

17.మిస్ ఇండియా 2022 రన్నరప్ గా హైదరాబాద్ అమ్మాయి

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

మిస్స్ ఇండియా 2022 రన్నరప్ గా, మిస్ గార్జియస్ ఫేస్ 2022 ను  హైదరాబాద్ కు చెందిన ఖుషి గుప్తా గెలుచుకున్నారు.

18.పోలవరం లో జగన్ , కేంద్ర మంత్రి షేకావత్ పర్యటన

పోలవరంలో ఏపీ సీఎం జగన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శేకావత్ పర్యటించారు.

19.నేడు జార్ఖండ్ సీఎం తో కేసీఆర్ భేటీ

Telugu Amaravathi, Anand Mahindra, Ap Telangana, Ap, Ap Poltics, Bjpjithender, C

నేడు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,700

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,040

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube