న్యూస్ రౌండప్ టాప్ 20

1.సాగర్ లో మూడు నామినేషన్ల ఉపసంహరణ

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ లు ఉపసంహరించుకున్నారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.సునీల్ అంత్యక్రియలు పూర్తి

Telugu Chandrababu, Jagan, Sujana Chowdary, Gold, Top-Latest News English

తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక పోవడం నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్న కేయూ విద్యార్థి బోర్డర్ సునీల్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.గూడూరు మండలం రామ్ సింగ్ తండా లో అంత్యక్రియలు నిర్వహించారు.

3.యాదాద్రి లో రేపటి నుంచి  ఆర్జిత సేవలు

యాదాద్రి లక్షి నరసింహ స్వామి సన్నిధిలో ఈ నెల 4 వ తేదీ నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నట్టు ఈవో గీతా రెడ్డి తెలిపారు.

4.నేడు ఐసెట్ నోటిఫికేషన్రా

ష్ట్ర వ్యాప్తంగా 2021- 22 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో అడ్మిషన్ ల కోసం నిర్వహించే టిఎస్ ఐసెట్ 2021 నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేశారు.

5.వ్యవసాయ పరిశోధనలకు డ్రోన్ లు

Telugu Chandrababu, Jagan, Sujana Chowdary, Gold, Top-Latest News English

వ్యవసాయ పరిశోధనల కోసం డ్రోన్లను వినియోగించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీకి కేంద్ర పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అనుమతి ఇచ్చారు.

6.తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పై కేసు

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు తేలడంతో , వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పై పోలీసులు కేసు నమోదు చేశారు .

7.స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ గా కవిత

Telugu Chandrababu, Jagan, Sujana Chowdary, Gold, Top-Latest News English

స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ గా ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మరోసారి విజయం సాధించారు.హైదరాబాద్ లోని స్కాట్స్ అండ్ గైడ్స్ ప్రధాన  కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో చీఫ్ కమిషనర్ గా కవిత గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి మంచాల వరలక్ష్మి తెలిపారు.

8.బాధ ఆవేదనతో నే ఈ నిర్ణయం

ఏపీలో పరిషత్ ఎన్నికల్లో టిడిపి బహిష్కరించడం పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు.ప్రస్తుత పరిణామాలతో కలత చెంది, బాధ, ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాబు ప్రకటించారు.

9.473 వ రోజుకి చేరుకున్న రాజధాని నిరసనలు

అమరావతి లోనే ఏపీ రాజధానిని కొనసాగించాలి అంటూ రైతులు , మహిళలు, ప్రజా సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు నేటికి 473 వ రోజుకి చేరుకున్నాయి.

10.ఏపీ మంత్రి వర్గ సమావేశం 

Telugu Chandrababu, Jagan, Sujana Chowdary, Gold, Top-Latest News English

ఈ నెల 22 వ తేదీన అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

11.పక్కా ఇళ్లకు 13 కోట్లు విడుదల 

ఏపీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన , వైఎస్సార్ హోసింగ్ పథకం కింద లబ్ధిదారులు సొంతంగా కట్టుకుంటున్న ఇళ్లకు ఏపీ ప్రభుత్వం బిల్లులు విడుదల చేసింది. 

12.ఏపీలో కరోనా

Telugu Chandrababu, Jagan, Sujana Chowdary, Gold, Top-Latest News English

ఏపీలోనూ కరోనా విజృంభణ తీవ్రతరం అవుతోంది.గడిచిన 24 గంటల్లో ఏపీ లో మొత్తం 610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.ఉగాది వేడుకలు రద్దు

మద్రాస్ వర్సిటీలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో  ఉగాది వేడుకలు ఈ నెల 9 న జరపతలపెట్టిన ఉగాది వేడుకలు కరోనా విజృంభణ నేపథ్యంలో రద్దు అయ్యాయి.

14.ఆదివారమూ పనిచేయనున్న వాక్సినేషన్ కేంద్రాలు

చెన్నైలో కరోనా వాక్సినేషన్ కార్యక్రమం గురువారం ప్రారంభం అయ్యింది.ఆదివారం సైతం వాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తాయి అని ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం తెలిపారు.

15.తెలంగాణలో కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

16.అర్జెంటీనా అధ్యకుడికి కరోనా

Telugu Chandrababu, Jagan, Sujana Chowdary, Gold, Top-Latest News English

అర్జెంటీనా దేశాధ్యక్షుడు అల్ బెర్టో పెర్నండేస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

17.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 89,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.పరిషత్ ఎన్నికల రద్దుకు జనసేన పిటిషన్ప

రిషత్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ జనసేన కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

19.నిధులు వస్తుంటే .హోదా ఎందుకు

Telugu Chandrababu, Jagan, Sujana Chowdary, Gold, Top-Latest News English

ఏపీకి ప్రత్యేక హోదా అడగడం అనేది అవుట్ డేటెడ్ విషయం అని, హోదా ద్వారా వచ్చే వాటికంటే ఎక్కువ నిధులు వస్తుంటే ఇక హోదా ఎందుకు అని బీజేపీ ఎంపి సుజనా చౌదరి అన్నారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,910

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,910.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube