న్యూస్ రౌండప్ టాప్ 20

1.కోవాగ్జీన్ మూడోదశ క్లినికల్ ట్రయల్ డేటా విడుదల

కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటాను భారత్ బయోటెక్ విడుదల చేసింది.కోవిడ్ పై కొవాగ్జీన్ 77.8 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.
 

2.జగన్ అక్రమాస్తులపై హై కోర్టు విచారణ

  ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుల వివరాలు ఇస్తే ఆ కేసుల వారీగా విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
 

3.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 44,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

4.పోలవరం ముంపు ప్రాంతాల్లో అఖిలపక్ష నేతల పర్యటన

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  పోలవరం ముంపు గ్రామాల్లో తెలంగాణ , ఏపీ అఖిలపక్ష నేతలు పర్యటించారు.
 

5.బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు 5 వరకు గడువు

  బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం ఇంటర్ డిగ్రీ కళాశాలలో ప్రవేశ దరఖాస్తు గడువు ఈనెల 5 తో ముగుస్తుందని అధికారులు తెలిపారు.
 

6.సైకిల్ తొక్కిన జగ్గారెడ్డి

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  మాదాపూర్ నుంచి గాంధీభవన్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించి నిరసన తెలిపారు.
 

7.జగన్ కు రఘురామ లేఖ

  ఏపీ సీఎం జగన్ కు ఆంగ్ల మాధ్యమంలో బోధన పై ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.
 

8.తిరుమల సమాచారం

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.నిన్న తిరుమల స్వామివారిని 14,433 మంది భక్తులు దర్శించుకున్నారు.
 

9.అగ్రి వర్సిటీలో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు

  సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోట లు, పుట్టగొడుగులు తేనెటీగల పెంపకంపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు ఆసక్తి గల యువత పేర్లు నమోదు చేసుకోవాలని ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఎస్ పూర్ణిమ కోరారు.
 

10.విద్యా రంగ సంస్కరణలపై ఆన్లైన్ బహిరంగ సభ

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న విద్యా రంగ సంస్కరణలు అంశంపై ఈ నెల 4న ఆన్లైన్ బహిరంగ సభ జరుగుతుందని ప్రజా సంఘాలు ప్రకటించాయి.
 

11.19 న చలో సీఎం నివాసం

  నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19 లో సీఎం నివాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ ఉద్యోగ పోరాట సమితి ప్రకటించింది.
 

12.వాహన మిత్ర రెండో దశకు ఆరు వరకు దరఖాస్తులు

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  వైయస్సార్ వాహన మిత్ర పథకం రెండో దశకు అర్హులైన ఆటో టైర్స్ ఈ మాక్సి క్యాబ్ డ్రైవర్లు కమ్ ఓనర్లు ఈనెల ఆరో తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు.
 

13.వెలమ కమ్మ సంఘ భవనాలకు పది ఎకరాల భూమి

  వెలమ కమ్మ సంఘం భవనాలకు తెలంగాణ ప్రభుత్వం పది ఎకరాల భూమిని కేటాయించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
 

14.పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల పరిమితి

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  జనాభా నియంత్రణ పద్ధతి కి మద్దతు పలుకుతూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించబోయే మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారికి ప్రభుత్వం నిబంధన విధించింది.ఇద్దరికీ మంచి పిల్లలు ఉన్నవారు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లేదని తేల్చి చెప్పింది.
 

15.రేపు ఉచితంగా ఆనందయ్య మందు పంపిణీ

  ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నెల్లూరుకు చెందిన ఆనంద్ ఆయుర్వేద మందులు ఉచితంగా పంపిణీ ని చెన్నైలో పంపిణీ చేయబోతున్నట్లు ఆ మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు.మందు కావలసినవారు 9543007007 కు ముందుగా మెసేజ్ పంపించాలని సూచించారు.
 

16.షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రియా

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  వైయస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న పార్టీ రాజకీయ వ్యూహ కర్తగా తమిళనాడుకు చెందిన ప్రియ ను ఎంచుకున్నారు.
 

17.మూడు కోట్ల కంటెంట్ లపై ఫేస్బుక్ చర్యలు

  ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 మధ్య తమ వేదికపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మూడు కోట్లకు పైగా కంటెంట్ లపై చర్యలు తీసుకున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ వెల్లడించింది.
 

18.ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు బెదిరింపు కాల్స్

  గవర్నర్ కోటాలో ఇటీవల ఎమ్మెల్సీ గా నియమితులైన కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి ఆర్ రమేష్ యాదవ్ కు వరుసగా రెండో రోజు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

19.ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా

Telugu Bihar, Ks Purnima, Ramesh Yadav, Sanga Mla Jagga, Gold, Top-Latest News -

  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బెర్త్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,250   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,250.     

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube