న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.బీజేపి నేత కారులో ఈవీఏం .అధికారులపై వేటు

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం ప్రైవేటు కార్ లో తరలించిన సంఘటనపై ఎన్నికల కమిషన్ స్పందించింది.బిజెపి అభ్యర్థి కారులో ఈవీఎం తరలించినట్లు ఆరోపణలు రావడంతో నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది.

2.పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో బిజెపి పిటిషన్ఏ

-Latest News English

పీలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

3.8 న జడ్పిటిసి ఎంపిటిసి పోలింగ్ఈ

నెల 8న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

4.ఎస్ఈసీ సమావేశానికి విపక్షాల డుమ్మా

పరిషత్ ఎన్నికలను పురస్కరించుకుని ఏపీ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి టిడిపి జనసేన బిజెపి పార్టీలు డుమ్మా కొట్టాయి.ఈ విషయాన్ని ముందుగానే ఆయా పార్టీలు ముందుగానే ప్రకటించాయి.

5.చంద్రబాబు ప్రధాని అయినా హోదా ఇవ్వలేరు

-Latest News English

ఏపీకి ప్రత్యేకహోదా పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు.ప్రత్యేక హోదా న వైసిపి ,టిడిపి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు.చంద్రబాబు ప్రధానమంత్రి అయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేరని సుజనా అన్నారు.

6.ఇండియన్ 2 : దర్శకుడు శంకర్ కి ఊరట

ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.ఆయన ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించడం పై స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

7.కరోనా తీవ్రత పై కేంద్రం అలర్ట్క

-Latest News English

రోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి అన్ని రాష్ట్రాల సీఎస్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు.

8.‘ గీతం ‘ సీఈవో గా బీఆర్ మీనా

గీతం డీమ్డ్ యూనివర్సిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా తెలంగాణ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీఆర్ మీనా నియమితులయ్యారు.

9.ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లమో ఫలితాల విడుదల

ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లమో ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.గత నవంబర్ లో ఈ పరీక్షలు జరిగాయి.ఈ నెల 16 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

10.ప్రధానిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

-Latest News English

ప్రజల ఆవేదన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం అని, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు.లక్షల మందికి జీవనోపాధి అని పేర్కొన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాను అని మోసం చేశాడు అని , భారత దేశాన్ని ఒకేసారి అమ్మేస్తాడు అంటూ విహెచ్ కామెంట్స్ చేశారు.

11.ముగిసిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని మెజారిటీ నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

12.స్టాలిన్ అల్లుడు ఇంట్లో ఐటీ సోదాలు

-Latest News English

తమిళనాడు శాసనసభ ఎన్నికల వేళ డీఎంకే అధినేత స్టాలిన్ అల్లుడిపై గురిపెట్టిన ఐటీ శాఖ ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.

13.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 81,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.అమెరికాలో జడ్జి గా తెలుగు మహిళ

-Latest News English

వాషింగ్టన్ డి.సి జిల్లా కోర్టు జడ్జి పుట్టగుంట రూపా రంగా నియమితులయ్యారు.ఆమె తల్లితండ్రులది కృష్ణ జిల్లా ఉయ్యూరు మండలం కలువ పాముల.

15.భారత్ నుంచి పత్తి, పంచదార

ధరలు విపరీతంగా పెరిగి పోతున్న నేపథ్యంలో భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భఅవించగా ఈ నిర్ణయాన్ని పాక్ కేబినెట్ తోసిపుచ్చింది.

16.ఉప రాష్ట్రపతి సిబ్బంది కారు ధ్వంసం

-Latest News English

జూబ్లీహిల్స్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో పార్క్ చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య సిబ్బంది వాహనం కొంతమంది గుర్తు తెలియని ఆకతాయిల దాడిలో ధ్వంసం అయ్యింది.

17.పుణెలో హోటళ్ళు బంద్ .కర్ఫ్యూ

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు విడతల వారీగా విధిస్తూ వస్తోంది.తాజాగా పుణె లో రాత్రి పూట కర్ఫ్యూ విధించాలనే నిర్ణయం తీసుకున్నారు.అలాగే హోటళ్ళు, బార్ లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

18.‘బూస్టర్ డోస్ ‘ కు సిద్దమయిన భారత్ బయోటెక్భా

-Latest News English

రత్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కోవిడ్ టీకాలను రెండు డోసుల్లో ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ టీకా వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఎంత కాలం ఉంటాయి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.దీంతో మూడో డోసు అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కు బూస్టర్ డోస్ ప్రతిపాదించింది.తాజాగా ఈ బూస్టర్ డోస్ క్లినికల్ ట్రైల్స్ కి భారత ఔషద నియంత్రణ సంస్థ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

19.ఆసుపత్రి లో చేరిన సచిన్

రోనా ప్రభావానికి గురైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు.సచిన్

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,900

24.క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,900.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube