న్యూస్ రౌండప్ టాప్ 20

1.బాలాపూర్ లడ్డూ కు రికార్డు ధర

Telugu Ap Fibernet, Balapurganesh, Bangaloremetro, Corona, Telangana, Telugu, To

బాలాపూర్ గణేశుడు లడ్డూ వేలం పాట జరిగింది లడ్డూ ధర 18 లక్షల 90 వేలకు కడప జిల్లా పొద్దుటూరు కు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్,  మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.భారత రైఫిల్స్ సంఘం ఉపాధ్యక్షుడుగా అమిత్

భారత రైఫిల్ సంఘం ఉపాధ్యక్షుడుగా అమిత్ సింగి ఎన్నికయ్యారు.ప్రస్తుతం ఆయన తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

3.సీటెట్ నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్ ) 2021 నోటిఫికేషన్ ను సీబీఎస్సీ విడుదల చేసింది.

4.నేడు ఏపీ ఈసెట్

డిప్లమో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం ఏపీసెట్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ శశిధర్ తెలిపారు.

5.ఏపీ ఫైబర్ నెట్ కేసు

Telugu Ap Fibernet, Balapurganesh, Bangaloremetro, Corona, Telangana, Telugu, To

ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో నిందితుడు సాంబశివరావు తరపు న్యాయవాది ఆదివారం ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

6.ఏపీలో సమాచారశాఖ ఫోన్లు బంద్

ఏపీలో సమాచారశాఖ ఫోన్లు బంద్ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సమాచార శాఖకు చెందిన ఉద్యోగుల సెల్ ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్ లు సర్వీస్ ను నిలిపివేశారు.

7.అంగన్వాడి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్నగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, మినీ కేంద్రాల్లో టీచర్లు , ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి తెలిపారు.

8.జైలుకు వెళ్లడానికి తాను సిద్ధం : అయ్యన్నపాత్రుడు

Telugu Ap Fibernet, Balapurganesh, Bangaloremetro, Corona, Telangana, Telugu, To

టిడిపికి ఏపీలో ఆదరణ పెరుగుతున్న దాన్ని తట్టుకోలేక వైసిపి దాడులు చేయిస్తోందని టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు.తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగానే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

9.బెంగళూరులో రాత్రి 10 వరకు మెట్రో రైళ్లు

బెంగళూరు నగరంలో మెట్రో రైలు 10:00 వరకు సంచరించును ఉన్నాయి ఈ మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్విడుదల చేసింది.

10.కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రితు రాజ్ అవస్తి

Telugu Ap Fibernet, Balapurganesh, Bangaloremetro, Corona, Telangana, Telugu, To

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రితు రాజ్ అవస్తి నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది.

11.భారత్ లో కరోనా

 గడచిన 24 గంటల్లో  దేశవ్యాప్తంగా కొత్తగా 38,945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.బాలాపూర్ ప్రజలు అదృష్టవంతులు : మంత్రి

బాలాపూర్ ప్రజలు అదృష్టవంతులని, బాలాపూర్ లడ్డు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రామానికి గుర్తింపు వచ్చిందని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు.

13.ఏపీ ఫైబర్ నెట్ పై కుట్ర : టిడిపి

ఏపీ ఫైబర్ నెట్ అంశంలో కావాలని బురద జల్లుతున్నారని టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.

14.బ్రహ్మోత్సవాలకు శ్రీవారి ఆలయం ముస్తాబు

Telugu Ap Fibernet, Balapurganesh, Bangaloremetro, Corona, Telangana, Telugu, To

తిరుమల శ్రీవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

15.అక్టోబర్ 6 నుంచి భద్రాద్రిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.

16.స్పోర్ట్స్ కోటాలో జూనియర్ కార్యదర్శుల భర్తీ

తెలంగాణలో స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టనున్నారు మొత్తం 172 పోస్టుల భక్తి కోసం పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

17.డిజిటల్ మీడియా డైరెక్టర్ కు చాణక్య అవార్డు

Telugu Ap Fibernet, Balapurganesh, Bangaloremetro, Corona, Telangana, Telugu, To

డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ చాణక్య అవార్డు దక్కింది.దీనిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అందజేశారు.

18.అమెరికాలో ఘనంగా వినాయక నిమజ్జనం

అమెరికాలోని ఫ్రీ అమౌంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది.

19.కమీషన్ల కోసమే బందరు పోర్ట్ ను బలి చేస్తున్నారు : టిడిపి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కమీషన్ల కోసమే బందరు పోర్టు ను బలి చేస్తున్నారని టిడిపి నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Fibernet, Balapurganesh, Bangaloremetro, Corona, Telangana, Telugu, To

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,390

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,390

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube